పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వం ఇంధన ధరలను పెంచిన వెంటనే, దేశంలోని ప్రధాన నగరాల్లోని రిటైల్ వ్యాపారులు నిత్యావసర వస్తువులు, తినుబండారాల ధరలను అమాంతం పెంచేశారు. పాత ధరలకు కొనుగోలు చేసిన సరుకులపైనే కొత్త రేట్లను వసూలు చేస్తుండటంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 7న ప్రభుత్వం లీటర్ పెట్రోల్, డీజిల్‌పై ఏకంగా 55 పాకిస్థానీ రూపాయలు పెంచింది. ప్రకటన వెలువడిన వెంటనే వ్యాపారులు నూడుల్స్, టూత్‌పేస్ట్, బిస్కెట్లు, స్థానికంగా తయారైన చాక్లెట్లు వంటి రోజువారీ వస్తువుల ధరలను పెంచేశారు. చిన్న వస్తువులు కొనడానికి దుకాణానికి వెళితే, ప్రతీ వస్తువుపై 10 రూపాయలు పెంచారని ప్రజలు ఆందోళ చెందుతున్నారు. ఈ ఆరోపణలపై వ్యాపారులు స్పందిస్తూ.. రవాణా, పంపిణీ ఖర్చులు పెరగడం వల్లే ధరలను సర్దుబాటు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. ధరలు తగ్గినప్పుడు తాము నష్టపోతాం కాబట్టి సర్దుబాటు చేసుకోవాలని ఆబ్పారా మార్కెట్లోని ఓ దుకాణదారుడు గులాం ఉల్లా తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వం ఇంధన ధరలను పెంచడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన ఆరోపించారు. హోల్‌సేల్ డీలర్లు, రవాణాదారులు ధరలు పెంచడంతో పప్పుధాన్యాల ధర కిలోకు 15 నుంచి 20 రూపాయల వరకు పెరిగిందని రావల్పిండి అసోసియేషన్ ఛైర్మన్ సలీం పర్వేజ్ బట్ తెలిపారు. ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు, రవాణా ఖర్చులు పెరిగాయని…బిజినెస్ రికార్డర్ నివేదిక తెలిపింది. దీని ప్రభావంతో ఇంధనాన్ని దిగుమతి చేసుకునే పాకిస్థాన్‌పై తీవ్ర భారం పడుతోందని, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ భారాన్ని ప్రజలపై మోపింది. ప్రస్తుతం లీటర్‌పై పెంచిన 55 రూపాయలు ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆ నివేదిక హెచ్చరించింది. కూరగాయల సరఫరా సరిపడా ఉన్నప్పటికీ, టమాటా, మిర్చి వంటి వాటి ధరలు కూడా మార్కెట్లలో విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి హోల్‌సేల్ మార్కెట్, కమిషన్ ఏజెంట్లే కారణమని చిల్లర వ్యాపారులు ఆరోపిస్తున్నారు.
pakistan
ఇరాన్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే ఆంక్షలు..
ఇరాన్(Iran)తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే ముందు తాము ఆంక్షలు విధిస్తామనే విషయాన్ని గుర్తెరగాలని పాకిస్థాన్(Pakistan)ను అగ్రరాజ్యం అమెరికా(America) హెచ్చరించింది. ఆంక్షలు విధించడంతో పాటు ఒప్పందాలకు అంతరాయం కలిగిస్తామని, ఇతర చర్యలకు ఉపక్రమిస్తామని వార్నింగ్ ఇచ్చింది. పాకిస్థాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్(Ballistic Missile Program) సరఫరాదారులపై అమెరికా ఆంక్షలు విధించడం యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ డిప్యూటీ వేదాంత్ పటేల్ స్పందించారు. నెట్‌వర్క్‌ల విస్తరణ, విధ్వంసక ఆయుధాల సేకరణకు సంబంధించిన కార్యకలాపాలు ఎక్కడ జరిగినా తాము అంతరాయం కలిగిస్తామని, చర్యలను కొనసాగిస్తామని వేదాంత్ పటేల్ స్పష్టం చేశారు.
ఇది చదవండి: ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో విజయం…
స్థూలంగా చెప్పాలంటే ఇరాన్‌తో వ్యాపార ఒప్పందాలను పరిగణించే ఎవరైనా ఆంక్షలు ఉంటాయనే విషయాన్ని గ్రహించాలని అన్నారు. ఈ మేరకు అన్ని దేశాలకు సలహా ఇస్తున్నామని అన్నారు. ప్రజల వినాశనానికి సంబంధించిన ఆయుధాలు, వాటి పంపిణీని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఆంక్షలు విధించాల్సి వచ్చిందని ఒక ప్రశ్నకు వేదాంత్ పటేల్ సమాధానమిచ్చారు. పాకిస్థాన్ మిసైల్ ప్రోగ్రామ్‌కు సరఫరాదారులుగా ఉన్న కంపెనీలు చైనా, బెలారస్లో ఉన్నాయని ఆయన ప్రస్తావించారు. ఈ కంపెనీలు పాకిస్థాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి పరికరాలు, ఇతర వస్తువులను సరఫరా చేసినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మూడు రోజుల పాకిస్థాన్ సందర్శన నేపథ్యంలో అమెరికా ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా రైసీ పాక్ పర్యటనలో ఇరుదేశాలు 8 ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్..అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ట్రంప్ రెండ్రోజుల చైనా పర్యటన ముగిసింది. ఒప్పంద ప్రకటనలేవీ లేకుండానే ఈ పర్యటన ముగిసింది. ఐతే కీలకాంశాల్లో ఏకాభిప్రాయాలు కుదిరాయని, ద్వైపాక్షిక సంబంధాల విషయంలో కీలక పురోగతి…
- ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మధ్య నెలకొన్న సుదీర్ఘ ఘర్షణలకు ముగింపు పలికే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాలు తమ మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో మూడు వారాల పాటు పొడిగించేందుకు అంగీకరించాయి. ఈ విషయాన్ని అమెరికా…
- యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్తో మోదీ భేటీ …ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబికి చేరుకున్నారు. మోదీ విమానం యూఏఈ గగనతలంలోకి ప్రవేశించగానే, ఆ దేశానికి చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు ఎస్కార్ట్‌గా వచ్చి అరుదైన గౌరవాన్ని అందించాయి.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
భారత్(India)లో ఉగ్రవాద కార్యకలాపాలకు యత్నించి సరిహద్దులు దాటి పారిపోయిన వారిని వదిలిపెట్టేదేలేదని, అలాంటి తీవ్రవాదులను అంతమొందించేందుకు పాకిస్థాన్(Pakistan)లోకి భారత్ ప్రవేశిస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) హెచ్చరించారు. ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు పారిపోయినా వారిని ఏరివేసేందుకు పాక్‌లోకి ప్రవేశిస్తామని అన్నారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలను కొనసాగించాలని భారత్ ఎల్లప్పుడూ కోరుకుంటుందని అన్నారు. అయితే పదే పదే కవ్విస్తూ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తే మాత్రం విడిచిపెట్టే ప్రసక్తేలేదని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
ఇది చదవండి: హిమాచల్ ప్రదేశ్ చంబాలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.3గా నమోదు
విస్తృత ప్రణాళికలో భాగంగా విదేశీ గడ్డపై ఉగ్రవాదులను భారత్ ఏరివేస్తోందని, 2020 నుంచి పాకిస్థాన్‌లో 20 మందిని మట్టుబెట్టిందంటూ బ్రిటన్‌కు చెందిన పత్రిక ఓ కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ కథనంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించలేదు. పాకిస్థాన్ విదేశాంగ శాఖ కూడా స్పందించేందుకు నిరాకరించింది. కాగా 2019లో జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి బాంబు దాడి తర్వాత భారత్, పాక్ సంబంధాలు దెబ్బతిన్నాయి.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
ప్రపంచ, ప్రాంతీయ సవాళ్లను పరిష్కరించేందుకు నిరంతర మద్దతి స్తామని హామీ..
పాకిస్థాన్(Pakistan) నూతన ప్రధాని షెబాజ్ షరీఫ్(Shebaz Sharif)కు అమెరికా(America) అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) లేఖ రాశారు. ప్రపంచ, ప్రాంతీయ సవాళ్లను పరిష్కరించే విషయంలో పాకిస్థాన్‌కు అమెరికా నిరంతర మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ శాంతి, భద్రతలకు ఇరుదేశాల మధ్య సంబంధాలు కీలకమని అన్నారు. అందరికీ మెరుగైన విద్య, వైద్యం, భద్రత, ఆర్థిక వృద్ధి విషయంలో భాగస్వామ్యం కొనసాగుతుందని బైడెన్ పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజలతో పాటు ప్రపంచజనుల భద్రత కోసం ఇరు దేశాల మధ్య శాశ్వత భాగస్వామ్యం కీలకమని బైడెన్ అభిప్రాయపడ్డారు. మానవ హక్కుల పరిరక్షణ, అభివృద్ధిలో పాకిస్థాన్‌తో కలిసి పనిచేసేందుకు అమెరికా కట్టుబడి ఉందని అన్నారు.
ఇది చదవండి: అమెరికాలో ఘోర ప్రమాదం..!
ఇరు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం, ప్రజల మధ్య సన్నిహిత బంధాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు పాకిస్థాన్‌లోని యూఎస్ ఎంబీసీ లేఖలోని విషయాలను వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడి హోదాలో పాక్ ప్రధానితో బైడెన్ జరిపిన తొలి అధికారిక సంభాషణ ఇదే కావడం గమనార్హం. 2021 జనవరిలో అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు చేపట్టాక పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఎలాంటి సంప్రదింపులు జరపలేదు. ఇక 2022 ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఇమ్రాన్ ఖాన్ స్థానంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నవాజ్ షరీఫ్‌తోనూ బైడెన్ మాట్లాడకపోవడం గమనార్హం.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి
పాకిస్థాన్‌లో ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించారని, ఒకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన పెషావర్‌లోని నాసిర్‌బాగ్ రోడ్‌లోని బోర్డు బజార్లో చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో పార్క్ చేసినటువంటి మోటార్ సైకిల్లో పేలుడు పదార్థాలు అమర్చి ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. పేలుడులో మరణించిన వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు, గాయపడిన వారిని ఖైబర్ టీచింగ్ ఆస్పత్రికి తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అయితే ఈ పేలుడు ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. ఇంతకుముందు ఫిబ్రవరిలో జరిగిన పేలుడులో ఐదుగురు పోలీసులు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. గత నెలలో, సార్వత్రిక ఎన్నికలకు ముందు పాకిస్తాన్లో వరుస బాంబు దాడులు జరిగాయి.
దాయాది పాకిస్థాన్‌లో జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో హింసాత్మక ఘటనల మధ్య శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగింది. ఇప్పటివరకు 250 స్థానాలకు పాకిస్తాన్ ఎన్నికల సంఘం ఫలితాలు ప్రకటించింది. ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన పీటీఐ పార్టీ మద్ధతున్న స్వతంత్రులు అత్యధికంగా 99 సీట్లు గెలుచుకున్నారు. ఇక నవాజ్ షరీఫ్ సారధ్యంలోని పీఎంఎల్-ఎన్ 71 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. పీపీపీ 53 సీట్లు, ఇతరులు 27 స్థానాలు గెలుచుకున్నారు. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉన్నాయి. తమ పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ లేదని, ఇతర పార్టీలను కలిసి రావాలని నవాజ్ షరీఫ్ విజ్ఞప్తి చేశారు. పాకిస్థాన్ ఎన్నికల్లో తమకే మెజారిటీ దక్కిందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. నవాజ్ షరీఫ్ ఒక తెలివితక్కువ రాజకీయ నాయకుడని వ్యాఖ్యానించారు. అయితే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.
మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పాకిస్థాన్ లో మరో 9 రోజుల్లో సాధారణ ఎన్నికలు జరగనుండగా, నేడు అత్యంత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అధికార రహస్యాల వెల్లడి కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ప్రత్యేక న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో మాజీ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీకి కూడా శిక్ష పడింది.
దీనిపై ఇమ్రాన్ ఖాన్ న్యాయవాది నయీం పంజుతా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ తీర్పును తాము అంగీకరించబోమని, ఇది అక్రమం అని పేర్కొన్నారు. ప్రభుత్వ రహస్యాలను లీక్ చేశారన్న అభియోగాలపై ఇమ్రాన్ ఖాన్ చాన్నాళ్లుగా విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసు ‘సైఫర్ కేసు’గా ప్రసిద్ధికెక్కింది. గతేడాది అమెరికాలోని పాక్ దౌత్య కార్యాలయంలో ఓ రహస్య కేబుల్ ను పాక్ ప్రభుత్వానికి పంపింది. ఈ కేబుల్ ను ఇమ్రాన్ ఖాన్ బహిర్గతం చేశారన్నది సైఫర్ కేసులో ప్రధాన అభియోగం. అధికార రహస్యాల చట్టం కింద ఈ కేసు విచారణ చేపట్టారు. ఇమ్రాన్ ఖాన్, షా మహ్మద్ ఖురేషీ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు. ఇది హై సెక్యూరిటీ కారాగారం. కాగా, ఇమ్రాన్ ఖాన్ ఈ కేసు విచారణను ఓ జోక్ అని గతంలో కొట్టిపారేశారు. ప్రాసిక్యూషన్ బృందం, డిఫెన్స్ బృందం అందరూ ప్రభుత్వానికి చెందినవారే అయినప్పుడు తమకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
దేశ రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఆఫ్ఘానిస్తాన్ లోని హిందూకుష్ ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో మధ్యాహ్నం 2.40 గంటలకు భూకంపం వచ్చింది. దీంతో ఢిల్లీ-ఎన్సీఆర్తో పాటు ఉత్తరాదిన పలు చోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హిందూకుష్ పర్వత శ్రేణుల్లో 220 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఢిల్లీ-ఎన్సీఆర్, రాజస్థాన్, జమ్ము, కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోనూ భూమి కంపించింది.
Read Also..
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు భారీ ఊరట లభించింది. రెండు కేసుల్లో ఆయనను నిర్దోషిగా పేర్కొంటూ ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది. 2018లో ఈ రెండు కేసుల్లో నవాజ్ షరీఫ్ ను అవినీతి నిరోధక కోర్టు దోషిగా పేర్కొంది. అవెన్ ఫీల్డ్ స్థిరాస్తుల కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం, అల్ అజీజియా ఉక్కు పరిశ్రమ కేసులో ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, అనారోగ్యానికి చికిత్స చేయించుకోవాలంటూ 2019లో లండన్ వెళ్లిన నవాజ్ షరీఫ్ అక్కడే ఉండిపోయారు. నాలుగేళ్ల పాటు లండన్ లో ప్రవాసం గడిపిన ఆయన స్వయం ప్రకటిత ప్రవాసం నుంచి ఇటీవలే బయటికి వచ్చారు. అక్టోబరులో పాక్ గడ్డపై అడుగుపెట్టారు. త్వరలో పాకిస్థాన్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన రాక ప్రాధాన్యంగా సంతరించుకుంది. షరీఫ్ తిరిగి రావడంతో ఆయన సొంత పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఇప్పుడు కోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వడంతో పీఎంఎల్-ఎన్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
పాకిస్థాన్‌లోని కరాచీ షాపింగ్ మాల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది మృతిచెందారు. రషీద్ మిన్నాస్ రోడ్డులో ఉన్న ఆర్జే మాల్లో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 8 మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. సుమారు 22 మందిని రక్షించారు. బిల్డింగ్‌లో నాలుగో ఫ్లోర్ వరకు క్లియర్ చేశారు. అయిదు, ఆరో అంతస్తుల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. తెల్లవారుజామున 6:30కు ప్రమాదం జరిగినట్లు తమకు సమాచారం అందిదన్నారు అగ్నిమాపక శాఖ అధికారులు. ప్రస్తుతం మంటల్ని అదుపు చేశారు.
Read Also..
Read Also..




Total views : 78964