తెలంగాణకు చల్లని కబురుతో పాటు కీలక హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇవాల్టి నుంచి నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. కర్ణాటక, తమిళనాడు మీదుగా విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో అకాల వర్షాలు పడుతున్నాయని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, వికారాబాద్, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
rain
ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాటు వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. మంగపేట మండలం కమలాపురం ఇంటెక్ వెల్ వద్ద వరద ప్రవాహం ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలోని గోదావరి పరివాహక ప్రాంతం జలకల సంతరించుకుంది. ఇదిలా ఉండగా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజ్ వద్ద ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద చేరగా 59 గేట్లు ఎత్తివేశారు. బ్యారేజ్ నుంచి 3 లక్షల 82 వేల 57 క్యూసెక్కుల వరద నీటిని దిగవకు వదిలినట్లుగా ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చీరాలలో చెత్త నుంచి సంపద లక్ష్యం గాలిలోకేనా?ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీలో “చెత్త నుంచి సంపద” సృష్టించాలనే ప్రభుత్వ లక్ష్యం నేడు ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పారిశుధ్యంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చీరాల పట్టణం… ఇప్పుడు చెత్త నిర్వహణలోనే తీవ్ర వైఫల్యాలకు నిలయంగా మారిందని…
- హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ..స్టార్ గా, పర్సన్ గా విజయ్ దేవరకొండ జర్నీ ఎప్పుడూ ప్రత్యేకమే. ఒక్కొక్కటిగా ఆయన అనౌన్స్ చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. హీరో కొత్త సినిమా ఆయన గత సినిమా సాధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ మీద, ఆ…
- ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు..ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఈ ప్రేమకథ వింటే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే..! సాధారణంగా పోలీసులు అంటే నేరస్తులకు భయం.. జైలర్ అంటే ఖైదీలకు వణుకు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. చట్టాన్ని కాపాడాల్సిన ఒక జైలు…
- విశాఖ కైలాసగిరిపై సరికొత్త అట్రాక్షన్..పర్యాటక కేంద్రమైన విశాఖపట్నంలోని కైలాసగిరిపై మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు VMRDA సుమారు రూ.2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ‘త్రిశూల్ ప్రాజెక్టు’ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ…
- యాదాద్రిలో హాట్ టాపిక్ గా ప్రభుత్వ భూముల వివాదం..యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ భూముల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఆలేరు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అధికార పార్టీకే కాకుండా స్థానిక అధికార యంత్రాంగానికీ సవాలుగా మారాయి.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వేసవి తాపం నుంచి కాస్త చల్లబడ్డ రాష్ట్రంలో రానున్న రెండు రోజులు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సౌరాష్ట్ర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. మధ్య మహారాష్ట్ర, ఉత్తర లోతట్టు కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటకకు విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది.
ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సూర్యాపేట్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. సోమవారం నుంచి రాష్ట్రంలో పొడివాతావరణం ఉంటుందని వెల్లడించింది.
ఉత్తర తమిళనాడు సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. తెలుగు రాష్ట్రాల వైపు తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణలో వానలు పడతాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.
ఇక ఆదివారం చూసుకుంటే.. వనపర్తి, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠస్థాయికి పడిపోయాయి. ఆదిలాబాద్‌లో కనిష్ఠంగా 15.5 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలో 22.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణలో వచ్చే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 2 వరకు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు తెలంగాణకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. మరోవైపు.. ఇవాళ హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. హిమాయత్ నగర్, చిక్కడపల్లి, నారాయణగూడ, అబిడ్స్, ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, పంజాగుట్ట, నాంపల్లి, బషీర్‌బాగ్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో గణేష్ నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయిన కూడా నిమజ్జనం కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అయింది.





Total views : 70874