కేబీఆర్ పార్కు రోడ్డు విస్తరణ పనులను అధికారులు ప్రారంభించారు. పలువురు ప్రముఖుల ఇండ్లకు రోడ్ల విస్తరణ కోసం అధికారులు మార్కింగ్ ప్రక్రియను చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, సినీ హీరో నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు బడా వ్యాపారవేత్తలు ఉన్నారు. జూబ్లీ హిల్స్ మహారాజ అగ్రసేన్ కూడలి నుంచి చెక్ పోస్టు వరకు కేబీఆర్ పార్కు హద్దు పొడవునా రోడ్డు విస్తరణ పనులు, పార్కు చుట్టూ ఉన్న ఆరు కూడళ్ల అభివృద్ధి పనుతలో ఈ పరిస్థితి నెలకొంది. ఏమైనప్పటికీ పనులను ముందుకు తీసుకెళ్లడంపై రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉందని, బాధితులందరికీ నచ్చజెప్పి భూసేకరణకు ఒప్పిస్తుందని అధికారులు చెబుతున్నారు.
కేబీఆర్ పార్కు జాతీయ ఉద్యానవనం హద్దు పొడవునా కొంత భూమి ఎకో సెన్సిటివ్ జోన్ గా ఉంటుంది. బీఆర్ఎస్ సర్కార్ ఎస్.ఆర్.డీ.పీ. పేరుతో 2016 కేబీఆర్ పార్కు చుట్టూ పైవంతెనలు నిర్మించేందుకు ప్రయత్నించగా ఆయా పైవంతెనల పిల్లర్లు ఎకో సెన్సిటివ్ జోన్ లో నిర్మిస్తున్నారంటూ పర్యావరణవేత్తలు జాతీయ హరిత ట్రిబ్యునల్ ను ఆశ్రయించి ప్రాజెక్టును రద్దు చేయించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్లను మార్చి ఎకో సెన్సిటివ్ జోన్ ను తాకకుండా నిర్మాణాలన్నింటినీ రోడ్డు వైపున చేపట్టాలని, అవసరమైన చోట ప్రైవేటు ఆస్తులను సేకరించాలని నిర్ణయించింది. బసవతారం క్యాన్సర్ ఆసుపత్రి, మహారాజ అగ్ర సేన్, ఫిల్మ్ నగర్, జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 45, చెక్ పోస్టు, కేబీఆర్ పార్కు ప్రధాన గేటు కూడళ్లలో 1,200 కోట్లతో ఏడు ఉక్కు వంతెనలు, ఆరు అండర్ పాస్ లను నిర్మించే పనుల్లో వేగం పెంచింది
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర–2047 థీమ్‌తో రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.సీడ్ యాక్సెస్ రోడ్డు…
- ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ చరిత్రలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ గేయాన్ని పూర్తిస్థాయిలో ఆలపించడం…
- టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే యాడ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ ఛానెళ్లలో ప్రతి గంటకు గరిష్టంగా 12 నిమిషాల వాణిజ్య ప్రకటనల ప్రసారానికే పరిమితం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం విధించిన నిబంధనను తొలగిస్తూ కేంద్ర…
- ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైందని, ఫ్లోరెస్ ప్రాంతంలోని ఎండే నగరానికి 68 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదైందని అంతర్జాతీయ భూభౌతిక కేంద్రాలు…
- నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు చెప్పింది. పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ తదితర యూనిఫాం సర్వీసుల ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్ల పాటు పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి