పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అరెస్టయిన నటుడు అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో నిన్న మధ్యాహ్నం అరెస్ట్ అయిన ఆయనకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆ తర్వాత కాసేపటికే రూ. 50 వేల పూచీకత్తుతో హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. అయితే, కోర్టు ఆర్డర్ కాపీ జైలుకు చేరడం ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ రాతంత్రా జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఆర్డర్ కాపీలు రాగానే, అప్పటికే ఆయన న్యాయవాదులు సిద్ధం చేసి ఉంచిన ష్యూరిటీ బాండ్లను సమర్పించారు. లాంఛనాలన్నీ పూర్తయ్యాక అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. కాగా ఇంటికి చేరుకున్న బన్నీకి సినీ ప్రముఖులు పరామర్శలు మొదలయ్యాయి. ప్రముఖ నిర్మాతలు, హీరోలు అల్లు అర్జున్ ఇంటికి చేరుకుని పరామర్శిస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అన్నమయ్య జిల్లాలో విషాదం…అన్నమయ్య జిల్లా పుంగనూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బైక్ నుంచి వచ్చే పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పుంగనూరు త్యాగరాజు వీధిలో ఈ ఘటన జరిగింది. మృతిచెందిన వారిని తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లుగా గుర్తించారు.…
- నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. నిర్భయ నిధి పథకం ద్వారా జిల్లాలో…
- అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ.అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ. పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే సంబంధిత పనులు పూర్తి చేస్తామన్నారు. అనంతవరం, నెక్కలు గ్రామసభలకు మంత్రి హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులతో కలిసి…
- ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్‌కు దారితీసింది.ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్‌కు దారితీసింది. జపాన్ సముద్ర జలాల్లోకి నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. తమ దేశ సముద్ర జలాల్లోకి ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించినట్లు…
- రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో డ్రగ్స్ కలకలం.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఫామ్‌హౌస్‌లో మద్యం, డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న పక్కా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి