భారత సంతతి వ్యోమగామి కెప్టెన్ సునీతా విలియమ్స్(Sunita Williams) మరోసారి అంతరిక్షయానం చేయనున్నారు. మే 7న భారత కాలమానం ప్రకారం ఉదయం 8.34 కు కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్ష నౌక బోయింగ్ స్టార్లైనర్ ద్వారా ఆమె ప్రయాణించనున్నారు. మరోసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనుండడంపై సునీత విలియమ్స్ స్పందించారు.ఈసారి కాస్త ఆందోళనగా ఉందని, అయితే ప్రయాణంపై అంత భయం లేదని అన్నారు. లాంచ్ ప్యాడ్ వద్ద శిక్షణ సమయంలో ఆమె ఈ మేరకు మాట్లాడారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరోసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించడం సొంత ఇంటికి తిరిగి వెళ్తున్నట్టుగా అనిపిస్తోందని అన్నారు. కాగా వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి ఆమె ఈ ప్రయాణం చేయనున్నారు.ఈ అంతరిక్షయానంతో హ్యుమన్-రేటెడ్ అంతరిక్ష నౌక ద్వారా ప్రయాణించనున్న తొలి మహిళగా సునీత విలియమ్స్ నిలవనున్నారు. కాగా గతంలో ఆమె 2006, 2012లలో రెండుసార్లు అంతరిక్షానికి వెళ్లారు. మొత్తం 322 రోజులు ఆమె అంతరిక్షంలో గడిపి చరిత్ర సృష్టించారు. అత్యధికంగా 50 గంటల 40 నిమిషాలపాటు స్పేస్ వాక్ చేసిన మహిళగా కూడా ఆమె రికార్డు సృష్టించారు.
- పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రభుత్వం ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ పార్లమెంటులో వెల్లడించిన సమాచారం ప్రకారం,…
- నేపాల్ రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రభంజనం సృష్టించింది.నేపాల్ రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రభంజనం సృష్టించింది. నేపాల్ ఎన్నికలు ఆ దేశ రాజకీయాలను సమూలంగా మార్చేశాయి. కేవలం మూడున్నరేళ్ల క్రితం ఆవిర్భవించిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ పార్లమెంట్ ఎన్నికల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. దశాబ్దాలుగా తమను శాసిస్తున్న హేమాహేమీలను…
- పశ్చిమాసియాలో యుద్ధ భీకర రూపం దాల్చుతోంది.పశ్చిమాసియాలో యుద్ధ భీకర రూపం దాల్చుతోంది. సమీకరణాలు కూడా మారిపోతున్నాయి. ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా పాల్గొంటోంది..అంతర్జాతీయ నిబంధనలనను అమెరికా ఉల్లంఘిస్తోందని ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి..అమెరికా చర్యలకు అక్కడ సెనెట్ ఆమోదించినా…ప్రపంచదేశాలు ఖండిస్తున్నాయి..రష్యా-చైనా-ఉత్తర కొరియా, క్యూబా కొన్ని అరబ్ దేశాలు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.