ప్రపంచ దేశాలలో అత్యుత్తమ దేశంగా ‘స్విట్జర్లాండ్’ మరోసారి నిలిచింది. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడోసారి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అందమైన పర్యాటక ప్రాంతాలతో పాటు జీవన ప్రమాణం, నాణ్యత, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా నిర్వహించిన సర్వేలో జనం స్విట్జర్లాండ్ కే జైకొట్టారు. ఈమేరకు అమెరికాకు చెందిన న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ సంస్థ ప్రపంచ దేశాల తాజా ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. స్విట్జర్లాండ్ వరుసగా మూడోసారి ఈ ఘనత సాధించగా.. మొత్తంగా ఏడుసార్లు ఈ జాబితాలో టాప్ లో నిలిచింది. జీవన నాణ్యత, వ్యాపార అవకాశాల విభాగాల్లో స్విట్జర్లాండ్ ఉన్నత స్థానంలో, వారసత్వ రంగంలో అట్టడుగు స్థానంలో ఉంది. చాలా విభాగాల్లో టాప్ లో నిలవడంతో స్విట్జర్లాండ్ కు ఈ ఘనత దక్కింది. స్విట్జర్లాండ్ తర్వాతి స్థానంలో జపాన్, అమెరికా, కెనడా, ఆస్టేలియా దేశాలు నిలిచాయి. టాప్ 25లో ఐరోపా దేశాలు ఉండగా.. భారతదేశానికి 33వ ర్యాంకు దక్కింది. గతేడాదితో పోలిస్తే 3 స్థానాలు దిగజారింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అన్నమయ్య జిల్లాలో విషాదం…అన్నమయ్య జిల్లా పుంగనూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బైక్ నుంచి వచ్చే పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పుంగనూరు త్యాగరాజు వీధిలో ఈ ఘటన జరిగింది. మృతిచెందిన వారిని తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లుగా గుర్తించారు.…
- నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. నిర్భయ నిధి పథకం ద్వారా జిల్లాలో…
- అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ.అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ. పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే సంబంధిత పనులు పూర్తి చేస్తామన్నారు. అనంతవరం, నెక్కలు గ్రామసభలకు మంత్రి హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులతో కలిసి…
- ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్‌కు దారితీసింది.ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్‌కు దారితీసింది. జపాన్ సముద్ర జలాల్లోకి నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. తమ దేశ సముద్ర జలాల్లోకి ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించినట్లు…
- రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో డ్రగ్స్ కలకలం.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఫామ్‌హౌస్‌లో మద్యం, డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న పక్కా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి