తెలంగాణ కేబినెట్ లో మాజీ మావోయిస్టులున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగొచ్చిన ఆదివాసి బిడ్డను అవమాన పరిచే కుట్ర జరుగుతోందని సీతక్క భావోద్వేగానికి గురయ్యారు. కేబినెట్ లోనక్సలైట్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చింది తానొక్కరే అని, అంత మాత్రానా మొత్తం క్యాబినెట్ కు నక్సలైట్ ముద్ర ఆపాదించడం సరికాదని మండిపడ్డారు. 2004 లో మొదటిసారి తాను ఎమ్మెల్యేగా పోటిచేసినప్పుడు బీజేపీ నాకు మద్దతిచ్చి ప్రచారం చేసిందని, అప్పుడు నా బ్యాక్ గ్రౌండ్ బీజేపీ నేతలకు తెలియదా? అని ప్రశ్నించారు. జనజీవన స్రవంతిలో కలిసాక..నల్లకోటు వేసుకుని లాయర్ గా ప్రజల పక్షనా ఎన్నో కేసులు వాదించానని, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని తెలియజేశారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలను తక్షణం వెనక్కు తీసుకోవాలని సీతక్క డిమాండ్ చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- దూరదర్శని చూసిన ప్రేక్షకులకు వాళ్ల సొంతూరికి వెళ్లిన ఫీల్ కలుగుతుంది..సువిక్షిత్, గీతికా రతన్ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్టైనర్ ‘దూరదర్శని’. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ ఈ చిత్రాన్ని…
- పూణేలో కూలిన శిక్షణ విమానం..మహారాష్ట్ర పుణే జిల్లా బారామతిలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణకు ఉపయోగించే ఓ విమానం సాంకేతికలోపంతో కూలిపోయింది. ఈ ఘటనలో ట్రైనీ పైలట్‌కు గాయాలయ్యాయి. రెడ్‌బర్డ్ ఏవియేషన్ సంస్థకు చెందిన విమానం శిక్షణ కార్యక్రమంలో ఉండగా అందులో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో…
- సోనియాగాంధీకి మరోసారి అస్వస్థత…కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గురుగ్రామ్‌లోని వేదాంత ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సోనియాగాంధీ ఆరోగ్యంనిలకడగా ఉందని వెల్లడించారు వైద్యులు. ఆమె వెంట కుమార్తె ప్రియాంక, కుమారుడు రాహుల్ గాంధీ ఉన్నారు. ఇటీవల…
- విజయ్ కు 144 మంది సభ్యుల మద్దతు..తమిళనాడు అసెంబ్లీలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. గంటల తరబడి సాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ నేతృత్వంలోని TVK ప్రభుత్వం బలపరీక్షలో ఘన విజయం సాధించింది. ప్రతిపక్షాల వ్యూహాలను చిత్తు చేస్తూ, ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి చరమగీతం పాడుతూ…
- Gujarat Titans ఘన విజయం.. Sunrisers Hyderabad 86 పరుగులకే కుప్పకూలింది..Sunrisers Hyderabad 169 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఘోరమైన బ్యాటింగ్ పతనాన్ని ఎదుర్కొంది. చివరకు 14.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభమే విపత్తుగా మారింది. Mohammed Siraj వేసిన తొలి ఓవర్లోనే Travis…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 74846