ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం సత్తన్న గూడెం లో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. గ్రామ శివారు తోటల్లో పులి పాదముద్రలను గుర్తించిన రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పాదముద్రలను సేకరించారు. అయితే పాదముద్రలు పరిశీలించగా అవి పెద్దపులి పాదముద్రలుగా అధికారులు ప్రాథమిక నిద్దరణ చేశారు. అధికారిక నిర్ధారణ కోసం వైల్డ్ లైఫ్ ల్యాబ్ కి వాటిని పంపించారు. అదేవిధంగా దెందులూరు మండలం పేరుగుగూడెంలో మొక్కజొన్న తోటలలో పెద్దపులి పాదముద్రలను గుర్తించి వాటిని సైతం అధికారులు సేకరించారు. గత వారం రోజులుగా ఏలూరు జిల్లాలో బుట్టాయిగూడెం కొయ్యలగూడెం అదేవిధంగా నల్లజర్ల తాజాగా ద్వారకాతిరుమల దెందులూరు మండలాలలో పులి సంచారంతో జిల్లా ప్రజలు బెంబేలెత్తుతున్నారు.. పులి ఏ వైపు నుంచి వచ్చి ఎటు దాడి చేస్తుందోనని రాత్రి అయితే ఇళ్లలో నుంచి బయటకు రాని పరిస్థితి. అదేవిధంగా బుట్టాయిగూడెం కొయ్యలగూడెం మండలాలలో తోటలలో పనులుకు సైతం కూలీలు పులి భయంతో వెనుకడుగు వేస్తున్నారు. పులిని పట్టుకునేందుకు అది సంచరించిన ప్రదేశాలలో ట్రాప్ కెమెరాలు అమర్చి, దాని కదలికలు గుర్తించి బోన్ల సహాయంతో వాటిని బంధించాలని ప్రజలు కోరుతున్నారు.
Tiger
కర్నూలు జిల్లా, పత్తికొండ లో శ్రీ శక్తి భవనం దగ్గర చిరుత పులి హల్ చల్. తిరగబడ్డ కుక్క, కుక్కకి , గొర్రెలకు గాయాలు. గొర్రెల కాపరి సమాచారం మేరకు గొర్రెల మంద పై చిరుత దాడి సమయంలో కుక్క అడ్డగించిందని, కొన్ని గొర్రెలకు కూడా గాయాలయ్యాయి అని కాపరి ప్రతాప్ తెలిపాడు. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పక్కనే ఉన్న పొలాల రైతులు వ్యవసాయం చేసుకోవడానికి బిక్కుబిక్కు మంటూ పనులు చేసుకుంటున్నారు. ఫారెస్ట్ అధికారులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్ అధికారులు రంగంలోకి ప్రవేశించారు.
పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం బట్రుపాలెం గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. పొలాల మధ్య చిరుతపులి తిరుగుతుండడంతో. అటవీశాఖ అధికారులకు బట్రుపాలెం గ్రామస్థులు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు చిరుత సంచారంపై నిఘా పేట్టారు. ఇక గ్రామంలో చిరుత సంచరించడంతో బట్రుపాలెం గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలోని ప్రజలను జాగ్రత్తగా ఉండాలని, అటవీశాఖ అధికారులు సూచించారు.
నల్లమలలో పెద్ద పులి కలకలం రేపుతోంది. కృష్ణానదిలో దాహం తీర్చుకోవడానికి వచ్చిన పెద్ద పులి, భయాందోళనలో వైజాగ్ జాలర్లు మత్స్యకారులు పశువుల కాపరులు. అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ రేంజర్ శరత్ చంద్ర రెడ్డి హెచ్చరించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరిగిరి సమీపంలోని పాత బొల్లారం దగ్గర పెద్ద పులి సంచారాన్ని గుర్తించారు. మూడు రోజుల క్రితం ఎల్లూరు గ్రామానికి చెందిన మేకల రాముడు మేకను చంపిన పెద్ద పులి. దీంతో వైజాగ్ జాలర్లు, మత్స్యకారులు, పశువుల కాపరులు భయాందోళనకు గురి అవుతున్నారు. ప్రాచీన కాలం నుంచి ప్రసిద్ధిగాంచిన అంకాలమ్మ కోటకు భక్తులు ప్రతి మంగళవారం దర్శనం కోసం వెళ్తుంటారు, భక్తులు గుంపులు గుంపులుగా దర్శనానికి వెళ్లాలని, లేకపోతే వెళ్లొద్దని ఫారెస్ట్ రేంజర్ శరత్ చంద్ర రెడ్డి తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతంలో వన్య మృగాల సంచారం పెరిగింది, అడవిలోకి వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. వన్యప్రాణులకు ప్రాణహాని కల్పిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో గత వారం రోజుల నుంచి పులి, చిరుతపులి సంచరిస్తుందని వద్దంతులు వినిపిస్తుడడంతో ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు గ్రామస్తులు తెలిపిన విధంగా అడుగులను పరిశీలించగా అవి కుక్క జాతికి చెందిన అడుగులుగా గుర్తించారు అయినా సరే వాళ్లు అప్రమత్తంగా ఉండి ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేసి వైల్డ్ ఫుట్ ఎక్స్పర్ట్ ను రప్పించి పరిశీలన చేయగా వారికి తేలింది ఏమనగా ఇక్కడ ఎలాంటి పులి కాని చిరుత పులి కాని సంచరిస్తున్నట్టు ఆనవాళ్లు లేవని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రతిమ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎవరు భయపడవద్దని ఇక్కడ పులి కానీ చిరుత పులికాని సంచరించిన ఆనవాళ్ళు లేవని అది కేవలం కుక్క జాతికి చెందిన కళ్ల గుర్తులే అని ఆమె ఈరోజు తెలిపారు
ఈ నేపథ్యంలో ఇంక వారు వాళ్ళ రెస్క్యూ టిం రంగంలోనే ఉండి ఇంక గమనిస్తూనే ఉన్నామని ఇంకా వీలైనన్ని ట్రాకింగ్ కెమెరాలను ఎర్పాటు చేసి ఎప్పటికపుడు ప్రజలకు సమాచారం ఇస్తామని తెలిపారు. ప్రజలు రాత్రి పూట ఒంటరిగా తిరిగొద్దని ప్రజలకు తెలిపారు. చేవెళ్ల పోలీసు కూడా రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తున్నారని ఏమైనా సమాచారం ఉంటే తెలుపాలని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో పెద్దపులి సంచారిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు ఫారెస్ట్ అధికారులు.. మండపల్లి పంచాయితీ అమ్మవారి పుట్టుక గ్రామ పొలాల్లో పెద్దపులి అడుగులను గుర్తించారు.. గ్రామాన్ని సందర్శించిన జిల్లా అటవీ శాఖ అధికారిని నిషా కుమారి.. పులి అడుగుజాడలను పరిశీలించి స్థానికులకు తగు సూచనలు చేసారు






Total views : 74840