యూపీఎస్సీ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం విడుదల చేసింది.. ఈ ఏడాది సివిల్స్ పరీక్షల్లో అనూజ్ అగ్నిహోత్రి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. రెండో స్థానంలో రాజేశ్వరి సువే నిలిచారు, మూడో ర్యాంక్ ఆకాన్ష్ ధుల్‌కు దక్కింది. నాలుగో ర్యాంక్ రాఘవ్ ఝున్‌ఝున్‌వాలా సాధించారు. సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. సృజన 55వ ర్యాంక్, డీఎస్కే ప్రచేత్ 193వ ర్యాంక్, ఎస్. వర్షిత్‌రెడ్డి 259వ ర్యాంక్, ఎం. పవన్‌కుమార్‌రెడ్డి 297వ ర్యాంక్, వి. విక్రమసింహారెడ్డి 541వ ర్యాంక్, గుమ్మల శ్వేత 573వ ర్యాంక్, పోతుపురెడ్డి భార్గవ్ 537వ ర్యాంక్, పుడారి రాహుల్ 748వ ర్యాంక్, కత్తిమాని అనిరుధ్ 786వ ర్యాంక్, కోరపాతుల శ్రీకర్ రాజు 806వ ర్యాంక్, ఇస్లావత్ శ్రీరామ్ హర్ష 823వ ర్యాంక్, కట్టా ప్రత్యూష 908వ ర్యాంక్, గోగుల రాజశేఖర్ 920వ ర్యాంక్, గుగులోతు జితేందర్ నాయక్ 939వ ర్యాంక్ సాధించారు. ఈ సంవత్సరం తెలుగు విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ అద్భుత పనితనం కనబరిచారు.
UPSC
యూపీఎస్సీ(UPSC) సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 1,016 మంది ఎంపికయ్యారు. ఆదిత్య శ్రీవాత్సవ(Aditya Srivatsava)కు మొదటి ర్యాంకు, అనిమేష్ ప్రధాన్(Animesh Pradhan)కు రెండో ర్యాంకు, దోనూరి అనన్య రెడ్డి(Donuri Ananya Reddy)కి మూడో ర్యాంకు దక్కింది. ఇక ఈ యూపీఎస్సీ ఫలితాల్లో వరంగల్‌కు చెందిన ముగ్గురు సెలక్ట్ అయ్యారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ర్యాంకుల పంట పండింది. మొత్తం 1,016 మంది ఎంపికయితే.. అందులో తెలుగు అభ్యర్థులు కనీసం 50కి పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వరంగల్ టౌన్ కు చెందిన జయసింహారెడ్డి 103 వ ర్యాంక్, గీసుకొండ మండలం అనంతరం గ్రామానికి చెందిన సయింపు కిరణ్ 568 ర్యాంక్, శివనగర్ కు చెందిన కోట అనిల్ కుమార్ 764 ర్యాంక్ సాధించారు. వీరిలో జయసింహారెడ్డికి ఐఏఎస్, కిరణ్ కు ఐపీఎస్, అనిల్ కుమార్ కు ఐఆర్ఎస్ వచ్చే ఛాన్స్ ఉంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: డాక్టర్ వి.ఎం థామస్ కి తృటిలో తప్పిన ప్రమాదం..
- ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..
- చిలకా ప్రొడక్షన్స్ థ్రిల్లర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్..
- తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 78956