పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు నిలిపివేసేంత వరకు… సింధూ జలాల ఒప్పందం పునరుద్ధరణ సాధ్యం కాదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పి.హరీష్ ఈ అంశంపై మాట్లాడారు. పాకిస్తాన్ను ప్రపంచ ఉగ్రవాద కేంద్రంగా పేర్కొన్నారు. 1960లో మంచి ఉద్దేశంతో ఈ ఒప్పందంపై భారత్ సంతకం చేసినప్పటికీ, గత ఏడాది జరిగిన పహల్గామ్ దాడి తర్వాత భారత్ దీనిని నిలిపివేసింది. దీనిపై పాకిస్థాన్ పలుమార్లు అంతర్జాతీయ వేదికలపై గగ్గోలు పెట్టినప్పటికీ భారత్ మాత్రం తన వైఖరిని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతూనే ఉంది. తాజాగా మరోసారి ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాకిస్థాన్ ఈ అంశంపై అక్కసు వెళ్లగక్కింది. అయితే భారత్ కూడా అదే స్థాయిలో దాయాదికి దీటుగా జవాబిచ్చింది.
Water
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి గ్రామంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజమోహన్ రెడ్డి రాజకీయ పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మేకపాటి విక్రమ్ రెడ్డిని మాజీని చేయడం దురదృష్టకరమని, ప్రజలే ఆ నిర్ణయం తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మర్రిపాడు, అనంతసాగరం మండలాలతో పాటు నియోజకవర్గవ్యాప్తంగా తమపై ఎందుకు వ్యతిరేకత వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. ప్రజల్లో వచ్చిన ఈ మార్పు తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఉదయగిరి ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేశారని, ఆయన అసలు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. ఇదే క్రమంలో ఆత్మకూరు నియోజకవర్గంలో తమ సొంత నిధులతో 20 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
రిజర్వాయర్లలో నీటి(Water) నిల్వలు పడిపోవడంతో ప్రజలు ఆందోళన..
దేశానికి తాగునీటి గండం పొంచి ఉంది. రిజర్వాయర్ల(Reservoirs)లో నీటి నిల్వలు పడిపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే తీవ్ర నీటి ఎద్దడితో సతమతమవుతున్న బెంగళూరు(Bangalore) దుస్థితి దేశానికి మొత్తం రానున్నదా అనే భయం ప్రజల్లో నెలకొంది. నిరుడు వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటి పోవడం ఇందుకు కారణమని సంబంధిత అధికారులు చెప్తున్నారు. తాగునీటి అవసరాలు రోజురోజుకు పెరుగుతుంటే అందుకు భిన్నంగా రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గిపోతున్నాయి.
దేశ వ్యాప్తంగా ఉన్న 150 రిజర్వాయర్లలో 38 శాతం మాత్రమే నీటి నిల్వలు..
దేశ వ్యాప్తంగా ఉన్న 150 రిజర్వాయర్లలో నీటిమట్టం మొత్తం సామర్థ్యంలో 38 శాతం మాత్రమే ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇది దశాబ్దపు సగటుకంటే తక్కువ కావడం రాబోయే నీటిగండం ముప్పును సూచిస్తున్నది. దక్షిణాది రాష్ట్రాల్లోని రిజర్వాయర్లలో వాటర్ స్టోరేజీ దారుణంగా పడిపోతున్నట్లు సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తం 42 ప్రాజెక్టులుండగా వీటి స్టోరేజీ కెపాసిటీ తగ్గుముఖం పట్టింది. దీంతో ఈ వేసవిలో బెంగళూరు తరహా నీటి ఎద్దడి తప్పకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: భగవంత్ సింగ్ మాన్ కీలక వ్యాఖ్యలు..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి
Health Tips:
భోజనం చేసిన వెంటనే నీరు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. మొదటిగా జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. నీరు తాగడం వల్ల కడుపులో ఉన్న యాసిడ్ పలుచన అవుతుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడం కష్టంగా మారుస్తుంది. అందుకే ఆహారం తిన్నవెంటనే నీరు తాగకూడదని వైద్యులు సూచిస్తున్నారు. తిన్నవెంటనే నీటిని తీసుకోవడం వల్ల ఈ రసాలు పలుచన అవుతాయి.
ఇది చదవండి: డ్రాగన్ ఫ్రూట్తో అందమైన చర్మం మీ సొంతం..!
శరీరంలో బలహీనత, అలసట, ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. నీరు తాగడం వల్ల కడుపులో ఉండే ఆహారం, గాలి మధ్య ఉండే మిశ్రమం పలుచన అవుతుంది. దీనివల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. అపానవాయువు, నొప్పి, అసౌకర్యం వంటి సమస్యలు, అజీర్ణం, మలబద్ధకం ఏర్పడతాయి. కడుపులో చికాకు, పొక్కులు వంటి సమస్యలు వస్తాయి. భోజనం చేసేటప్పుడు నీరు తాగడానికి దూరంగా ఉండాలి.
ఇది చదవండి: భోజనం చేసిన తర్వాత బెల్లం తింటున్నారా..!
చిన్న పిల్లలు అన్నం తినేటప్పుడు నీరు తీసుకోవచ్చు. అయితే పెద్దవారు మాత్రం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఆహారం జీర్ణం కావడానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. అదే సమయంలో నీరు తాగడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. ఆహారం తీసుకున్న 45 నుంచి 60 నిమిషాల తర్వాతే మంచినీరు తాగాలి. ఆహారం తినే అరగంట ముందు నీళ్లు తాగాలనే విషయాన్ని గుర్తుంచుకోండి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కొత్తగూడెం కాలనీకి చెందిన కట్ట శ్రీనివాస చారి ఇంటి బోర్ నుండి గులాబీ రంగు లో నీరు ప్రవహిస్తుండడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. నిరవధికంగా గులాబీ రంగులో నీరు ప్రవహిస్తుండటంతో విస్తుపోయాడు. విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు రంగు నీటిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ నీటిని ఉపయోగించడం లేదని శ్రీనివాస్ పేర్కొన్నాడు. భూమిలోని పొరల్లో ఏదైనా మార్పులు సంభవించి ఉండవచ్చునని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నీటిని పరిశీలించాలని బాధితుడు కోరారు..
నీటి వృధా పై సమగ్ర స్థాయిలో విచారణ జరిపేందుకు చర్యలు తీసుకోవాలని నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. సాగునీటి సలహా మండల సమావేశానికి వచ్చే రైతుల పట్ల పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారంటూ దుయ్యబట్టారు. నియోజకవర్గంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు సైతం నిధుల లేమితో నిలిచిపోయాయన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి రైతులను ఆదుకోవాలన్నారు.
Read Also..
Read Also..
డ్రేనేజీ, వాటర్ ప్రభుత్వ స్దలాలు కాపాడుటకై తాము చిత్తశుద్దితో పని చేస్తామని కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్ది కొలన్ హన్మంత్ రెడ్డి తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ది కొలన్ హనుమంత్ రెడ్డి బాచుపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ లో రోడ్ల గుంతలమయం అవ్వడంతో గతంలో బాచుపల్లి రెడ్డి లాబ్స్ దగ్గర్లో తండ్రీ కూతురు బస్ కింద పడిన ఘటన, బాచూపల్లి ఇందరమ్మ కాలనీలో నీళ్ల సమస్య, స్కూల్ పిల్లల స్కూల్ కి వెళ్ళాలి అంటే రోడ్ల పైన సాహసం చేయాల్సిన దుస్థితి, దేవేందర్ నాగర్ పేట్ బషీరబాద్ లలో ప్రభుత్వ స్దలాలు కబ్జాకు గురైయ్యాయని…కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డ్రైనేజీ, వాటర్, డెవలప్ మెంట్ తదితర అన్ని సమస్యల పట్ల చిత్తశుద్దితో పని చేస్తామని పేర్కొన్నారు. అనంతరం కుత్బుల్లాపూర్ BRS సీనియర్ నాయకుడు కొలన్ శ్రీనివాస్ రెడ్డి BRS కు రాజీనామా చేసిన విషయాన్ని తెలుసుకొని ఆయనను పార్టీలోకి ఆహ్వానించడానికి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెల్లాడు. రేపు రేవంత్ రెడ్డి సమక్షంలో కొలన్ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరుతాడని కొలన్ హన్మంతరెడ్డి తెలిపాడు.





Total views : 74853