ప. గో. జిల్లా, పెనుగొండ జగన్నన్న కాలనీలో ఒక కుటుంబం పై మరొక కుటుంబ సభ్యుల దాడి. పక్కింటి నుంచి పొగ వస్తుందనే కారణంతో తల్లీ కొడుకులపై నలుగురు దాడి. విచక్షణ రహితంగా సుత్తి తో దాడి చేయడంతో తల్లి కొడుకులకు తీవ్ర గాయాలు. ఇరు కుటుంబాలు పరస్పర దాడి కి దిగటం తో పరిస్థితి తీవ్రంగా మారింది. తల్లీ కొడుకులు ని చికిత్స నిమిత్తం ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులకు పిర్యాదు చేసిన బాధితులు.
West Godavari
ప్రజల ఆస్తికి భద్రతలేని ఏపీ భూహక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో న్యాయవాదుల సంఘం నిరసన చేపట్టారు. కోర్టు విధులను బహిష్కరించి నరసాపురం పట్టణం అంబేద్కర్ సెంటర్ లో కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూహక్కు చట్టాన్ని తీసుకొచ్చిందని ఇది ఒక చీకటి చట్టం అన్నారు. ప్రజల ఆస్తికి ఎటువంటి భద్రత లేని ఈ చట్టాన్ని తక్షణమే ప్రభుత్వం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. నరసాపురం కోర్ట్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నరసాపురం లోని న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. అమాయకులకు వలవేసి రెండు కోట్లలతో, మణపూరి సత్యనారాయణ అనే వ్యక్తి ఉడాయించాడు. చిట్స్, అప్పులు, రియల్ ఎస్టేట్ పేరుతో అమాయకులైన పట్టణ ప్రజల నుంచి సుమారు రెండు కోట్లు చేశాడు. లారీ డ్రైవర్లు, గృహిణులు, చిరుద్యోగులు వంటి దిగువ తరగతి వారిని టార్జెట్ చేస్తున్నాడు. అధిక మొత్తాల్లో లాభాలు వస్తాయని నమ్మబలికి, కోట్లల్లో వసూలు చేసాడంటూ బాధితులు వెల్లడించారు. ఇంటి స్థలం అమ్ముతానని మోసం చేసి, తన వద్ద లక్షల్లో సొమ్ము వసూలు చేశాడని బాధితుడు సుధాకర్ తెలిపాడు. అనంతరం కుటుంబంతో సహా పరారయ్యాడని సుధాకర్ లారీ డ్రైవర్ వెల్లడించారు.
Read Also..
Read Also..
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వశిష్ట గోదావరిలో మార్గశిర పాడ్యమి పోలిస్వర్గం పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో పట్టణంలోని వలందర్, అమరేశ్వర స్నానాల రేవులు భక్తులతో కిటకిటలాడాయి. స్నానమాచరించి గోదావరి గట్టుపై పూజలు చేసి అనంతరం పాడ్యమి దీపాలను నదిలో విడిచిపెట్టారు. పోలిస్వర్గoగా పిలుచుకునే పూజా కార్యక్రమానికి ఎంతో విశిష్టత ఉంది. కార్తీక మాసంలో పూజా కార్యక్రమాలు చేయలేని భక్తులు పాడ్యమి రోజున నదిలో పుణ్య స్నానం చేసి 30 దీపాలు విడిచి పెడితే కార్తీక మాసంలో నెల రోజుల పాటు చేసే పూజా కార్యక్రమాలకు వచ్చేంత పుణ్య ఫలం లభిస్తుందన్నది భక్తుల నమ్మకం.
నెల రోజుల క్రితం అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఇంకా నవ దంపతుల కాళ్లపారాణి ఆరనే లేదు. నవదంపతులు విహారయాత్ర విషాదయాత్రగా మారింది. బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఆజంట సముద్రంలో గల్లంతయ్యారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామానికి చెందిన రేలంగి లక్ష్మీనారాయణకు, నాగ గాయత్రి తో గత నవంబరు 1న వివాహం జరిగింది. వరుడు లక్ష్మీనారాయణ భీమవరంలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో లక్ష్మీనారాయణ తన సతీమణి నాగ గాయత్రితో కలిసి విహార యాత్రకు కోనసీమ జిల్లా అంతర్వేది వచ్చారు. అయితే బీచ్‌లో స్నానానికి దిగగా కెరటాల ఉద్ధృతికి సముద్రంలో మునిగి గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న ఇరుకుటుంబాల సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని రాత్రి వరకు గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నదంపతుల ఆచూకీ కోసం మత్స్యకారులు, గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Read Also..
Read Also..
మిచాంగ్ తుఫాన్ పోతూ పోతూ పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం తీర ప్రాంతంలో బీభత్సం సృష్టించింది. తీరం దాటే సమయంలో వీచిన బలమైన ఈదురు గాలులకు మండలంలోని రుస్తుం బాధ, లిఖితపూడి, భీమవరం రోడ్డులో భారీ వృక్షాలు, కొబ్బరి చెట్లు 30కి పైగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కొన్నిచోట్ల కరెంటు స్తంభాలు ఇళ్ల పైకప్పులపై పడ్డాయి. దీంతో చాలా గ్రామాలలో అంధకారం నిండిపోయింది. వర్ష తీవ్రత పెరిగింది. సముద్రంలో అలలు ఎగిసి పడుతుండడంతో ప్రజలలో ఇంకా తుఫాన్ భయం వీడలేదు.
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తీవ్ర తుఫాన్ ప్రభావంతో ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కూడా చిరుజల్లులతో కూడిన కుండపోత వర్షం కురుస్తోంది. రెండు రోజులుగా వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురవగా,మరికొన్ని ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది. కురుస్తున్న భారీ వర్షాలకు వరి, పత్తి, మిరప, మామిడి, మొక్కజొన్న పంటలు దెబ్బతినే అవకాశం ఉండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వరి పంట కొంతమేరకు పొట్ట దశలో ఉండగా ఆచేలు నెలవాలాయి కొంత శాతం కోసి కల్లాలు పై ఉండగా అకాల వర్షానికి వడ్లు మొలకలు వచ్చేస్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న పంట కూడా వివిధ దశల్లో ఉండగా చిన్న మొక్క నుంచి అడుగెత్తు మొక్క వరకు నీట మునిగి మొక్కజొన్న మొక్కలు చనిపోయి కొంత భాగం నేల వాలిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అకాల వర్షానికి మిర్చి చెట్లు సైతం నేలవాలాయి, పత్తి చెట్ల నుండి పత్తి తీసే తరుణంలో పత్తి తడిసి ముద్దయిపోవడంతో లోపలి గింజల సైతం మొలకలు వస్తాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ అకాల వర్షం వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని మిషన్ హై స్కూల్ రోడ్లో . అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో కూల్ డ్రింక్ షాప్ దగ్ధమైంది . జనసేన పార్టీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న చించినాడ శ్రీనివాస్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో సకాలంలో మంటల్ని అదుపు చేశారు. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం అయి ఉండవచ్చని భావిస్తున్నారు .ఆస్తి నష్టం 3 లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
టిడ్కో గృహా లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాదయాత్ర నిర్వహించారు. ఒకటో వార్డు నుంచి పదో వార్డ్ వరకు సాగుతున్న ఈ పాదయాత్రలో లబ్ధిదారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స ఈ నెల 15న తలపెట్టిన పాలకొల్లు చూడు అనే కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. అనంతరం నిమ్మల మీడియాతో మాట్లాడారు.
టిడ్కో గృహ లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు నా ఉద్యమం ఆగదన్నారు. ఈ టిడిపి ప్రభుత్వ హయాంలో 90 శాతం పూర్తయిన టిడ్కో గృహాలను మిగిలిన 10 శాతం పూర్తిచేసి అందరికీ ఉచితంగా ఇవ్వాలని కోరారు. ఇళ్ల స్థలాలను నివాస ప్రాంతాల్లోనే లబ్ధిదారులకు ఇవ్వాలన్నారు.టిడ్కో గృహాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణగ్రస్తులని చేసిందని నిమ్మల విమర్శించారు.
Read Also..
Read Also..
ఏపీలో మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమ వాయువ్యంగా పయనించి అరేబియా సముద్రంలో ప్రవేశించనుంది. ఈ ప్రభావంతో నవంబర్ 8 న ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని కారణంగా ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారి.. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, తిరుపతి, కడప జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయంటున్నారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల జల్లులు, మబ్బు వాతావరణం ఉంటుంది అంటున్నారు. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల జల్లులు, మబ్బుగా ఉంటుందని వాతవరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.