గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని సంవత్సరాల కొద్దీ సాగదీసిందని, నోటిఫికేషన్ల దశలోనే కొన్నేళ్ల పాటు ఉంచారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన ఒక వెయ్యి 635 మందికి నియామక పత్రాలు అందజేశారు. వివిధశాఖల్లో ఉద్యోగాలు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇంజనీర్ల కృషి గొప్పతనం ఈ సమాజానికి చాలా అవసరమన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబంలోని వారి ఉద్యోగాలు పోతేనే పేదలకు ఉద్యోగాలు వస్తాయని ఆనాడు చెప్పానన్న రేవంత్రెడ్డి.. తాను చెప్పినట్టే కేసీఆర్ ఉద్యోగం పోయిన తర్వాత.. ఇప్పుడు పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయన్నారు.
మూసీ అంటే మురికి కూపమనే పేరు స్థిరపడిందన్నారు. ప్రజలు నిరాశ్రయులు అవుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా? మల్లన్నసాగర్, కొండపోచమ్మ, గంధమల్లు రిజర్వాయర్ల నిర్మాణం వల్ల ఎవరి భూములూ పోలేదా? అని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ పేరుతో రైతులను బలవంతంగా ఖాళీ చేయించారని.. మూసీ నిర్వాసితులకు మంచి స్థలంలో ఆశ్రయం కల్పిస్తామన్నారు. నిర్వాసితులను ఎలా ఆదుకోవాలో సలహాలు ఇవ్వాలని రేవంత్రెడ్డి కోరారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం..రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని, ధాన్యం తక్కువ ధరకు అమ్ముకోవద్దని, రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమ చేస్తామని…
- నిరుద్యోగులను గాలికి వదిలేసిన కేసీఆర్గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేశారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 56 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.…
- బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలపై హైకోర్టు విచారణ..బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపులపై హైకోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం చౌకగా భూములు అమ్మకాలు చేశారని పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. 500 కోట్లు విలువైన భూమిని 5…
- ట్రాఫిక్కు తీవ్ర అడ్డంకిగా మారిన ఫుట్ పాత్ షాపులుట్రాఫిక్కు తీవ్ర అడ్డంకిగా మారిన ఫుట్ పాత్ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. కొత్త పేట రైతు బజార్, ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్ వద్ద ఫుట్ పాత్ ఆక్రమణలకు గురైయ్యాయి.…
- మధ్యాహ్న భోజనం పథకం అంటేనే … పురుగులు అన్నం, నీళ్ల సాంబార్శ్రీ సత్య సాయి జిల్లా మడకశిరలోని జడ్పిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ వద్ద మధ్యాహ్నం భోజనం సరిగా వడ్డించడం లేదని విద్యార్థులు ఆరోపించారు. పాఠశాలో దాదాపు 400 మంది విద్యార్థులు ఉండగా.. 150 మంది దాకా విద్యార్థులు ఇంటి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి