కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతోందని కరీంనగర్ లో చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ యుద్దం ప్రకటించబోతోందన్నారు. మహారాష్ట్రలో ఎన్ని అబద్దాలు ప్రచారం చేసినా కాంగ్రెస్ కూటమిని నమ్మలేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని చెప్పారు. గతంలో కంటే ఎక్కువ మెజారిటీ సీట్లు బీజేపీ కూటమికి కట్టబెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ఐరన్ లెగ్ పార్టీ అని, ఆ పార్టీతో జతకట్టిన పార్టీలన్నీ మునిగిపోతున్నాయన్నారు. కాంగ్రెస్ కూటమి ముక్కలు కావడం కాంగ్రెస్ కూటమి ముక్కలు కావడం ఖాయం అన్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలుకాబోతున్నాయని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం, అవసరం బీజేపీకి లేదని చెప్పిన బండి సంజయ్…. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూల్చుకుంటారని చెప్పారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- విజయవాడ గిరిపురంలో డయేరియా కలకలం.విజయవాడను డయేరియా వణికిస్తోంది. గిరిపురంలో వారం రోజులుగా అతిసారం కలకలం రేపుతోంది. చిన్నారులు, పెద్దలు వాంతులు విరోచనాలతో విలవిలలాడుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే విజయవాడలో డయేరియా ప్రబలటం నిత్యకృత్యమైంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటంలో అధికారులు విఫలం చెందుతున్నారు. నల్లాల్లో అపరిశుభ్రమైన నీరు…
- మెక్సికోలో భారీ భూకంపం.మెక్సికో దక్షిణ పసిఫిక్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. గ్వాటెమాలా సరిహద్దుకు సమీపంలో చోటుచోసుకున్న ఈ భూప్రకంపనల ప్రభావం మెక్సికో సిటీతో పాటు ఎల్ సాల్వడార్ వరకు విస్తరించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా నమోదైంది. గంట వ్యవధిలో…
- షార్ నుంచి తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం.భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో సరికొత్త శకం ఆరంభమైంది. హైదరాబాద్కు చెందిన స్పేస్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ రూపొందించిన ఆర్బిటాల్ రాకెట్ ‘విక్రమ్-1’ నేడు నింగిలోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించడానికి సిద్దంగా ఉంది. ఈ ప్రయోగానికి ‘మిషన్ ఆగమన్’ అని పేరు…
- తమిళనాడు పెరంబలూర్ వద్ద ఘోర ప్రమాదం.తమిళనాడు పెరంబలూర్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. చెన్నై-మధురై హైవేపై ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డారు 23 మంది ప్రయాణికులు. ప్రైవేట్ స్లీపర్ బస్సులో ఎగసిపడిన మంటలు క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది.…
- కొత్తగూడెం జిల్లా గ్రంథాలయంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని నూతన జిల్లా గ్రంథాలయంలో 10 లక్షల రూపాయల ఎంపీ లాడ్స్ రాజ్యసభ నిధులతో నిర్మించనున్న ప్రహరీ గోడ పనులకు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసాయం రఘురాం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 214671