58
హైదరాబాద్లోని మధుయాష్కీ గౌడ్ నివాసంపై అర్థరాత్రి పోలీసులు దాడి చేశారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా, మూకుమ్మడిగా పోలీసుల బృందం ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడింది. సోదాల పేరుతో, కుటుంబ సభ్యులను పోలీసులు భయబ్రాంతులకు గురిచేశారు. మధుయాష్కీ నివాసంలో పెద్ద ఎత్తున డబ్బు ఉందన్న సమాచారంతో, పోలీసులు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ సెర్చ్ వారెంట్ లేకుండా దాడి చేయడంతో, కాంగ్రెస్ శ్రేణులు ఆశ్చర్యపోతున్నాయి. హయత్ నగర్ లో ఉద్రిక్తత అర్థరాత్రి మధుయాష్కీ గౌడ్ నివాసం ఇంటిపై అనుమతి లేకుండా ఇంట్లోకి చొరబడి పోలీసుల మూకుమ్మడి దాడి జరగటం తో కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురి అయ్యారు.