మూసీనది ప్రక్షాళనలో భాగంగా నిర్వాసిత కుటుంబాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే నదీగర్భంలో నివాసాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రెండు పడకల గదుల ఇళ్లను కేటాయిస్తున్న ప్రభుత్వం.. విద్య, ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సెర్ఫ్ సీఈవో ఛైర్మన్‌గా, జీహెచ్ఎంసీ కమిషనర్ వైస్ ఛైర్మన్‌గా 14 మంది సభ్యులతో జీవనోపాధి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ దాన కిషోర్ కన్వీనర్‌గా ఉన్న ఈ కమిటీలో మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఎస్సీ, బీసీ సంక్షేమశాఖతోపాటు పాఠశాల విద్య కమిషనర్, తెలంగాణ గురుకుల పాఠశాలల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కమిటీలోని సభ్యులు..తమ తమ శాఖలకు సంబంధించిన కార్యాచరణను రూపొందించి 30 రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించింది.
మూసీ నిర్వాసితుల కోసం ప్రత్యేక కమిటీ
- యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డియాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు. ఈవేళ సీఎం రేవంత్‌రెడ్డి పుట్టిన రోజు కావడంతో హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాఫ్టర్‌లో యాదగిరి గుట్టుకు చేరుకున్నారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో వేద పండితులు ప్రత్యేక…
- బోరుగడ్డ అనిల్ కు రాచమర్యాదలుఏడుగురు పోలీసులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు వేటు వేసింది. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌ను జైలుకు తరలించే క్రమంలో ఆయనకు రాచమర్యాదలు చేశారు. బోరుగడ్డ అనిల్‌ను గన్నవరం క్రాస్ రోడ్డులోని ఓ రెస్టారెంట్లోకి…
- గవర్నర్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి..రాజ్ భవన్ లో గవర్నర్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి…
- విజయవంతంగా ముగిసిన లోకేశ్ అమెరికా పర్యటనఅమెరికాలో ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పెట్టుబడుల యాత్ర విజయవంతంగా ముగిసింది. వారం రోజుల పర్యటనలో 100కు పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో మంత్రి వరుసగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పరిశ్రమదారుల్లో…
- వయనాడ్‌లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంవయనాడ్లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వయనాడ్ ప్రజల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటన తర్వాత తాను కేరళకు తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి వచ్చానని, ఆ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి