Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home Latest News మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి ముందు ధర్నా .

మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి ముందు ధర్నా .

by CVR NEWS
మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి ముందు ధర్నా

తెలంగాణలో ఆశా వర్కర్లు మరోసారి రోడ్డెక్కారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి ముందు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఫిక్స్డ్ వేతనం, పారితోషికాల చెల్లింపు, ఉద్యోగ భద్రతతో పాటు పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇరవై ఏళ్లుగా గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు కనీస వేతనం కూడా లేకపోవడం బాధాకరమని సీఐటీయూ నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం, ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Advertisements

You may also like

Our Visitor

023956
Total views : 143626

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.