92
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్‌కు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. సోలార్ ప్లాంట్ ద్వారా నెలకు లక్ష రూపాయల ఆదాయం వచ్చే విధంగా డిజైన్ చేశామన్నారు. నియోజకవర్గంలో ప్రతి మండలానికి ఒక బస్సును మహిళా సంఘాలకు కేటాయించి మహిళలకు ఉపాధి కల్పించామని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ అసమర్థత కారణంగా బంగారు, వెండి ధరలు పెరగుతున్నాయని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ పెంచడంతో మధ్య తరగతి ప్రజలకు భారంగా మారిందన్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.




Total views : 202996