Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Latest News బీఆర్ఎస్‌పై చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు.

బీఆర్ఎస్‌పై చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు.

by CVR NEWS

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసే ప్రతి వ్యాఖ్యను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో విషబీజాలు నాటేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఇప్పుడు కేవలం సోషల్ మీడియా పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. కేటీఆర్, హరీశ్ రావులు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. గోదావరి, బనకచర్ల అంశాల్లో కేంద్రం వెనక్కి తగ్గడానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కృషే కారణమని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలోనే పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని, విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అలాగే టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్‌గా అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: