మహబూబ్ నగర్ జిల్లా కోయిల్ సాగర్ ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల నుంచి సాగునీరు విడుదలైంది. సాగునీటిని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి విడుదల చేశారు. ప్రస్తుతం కోయిల్ సాగర్ రిజర్వాయర్లో 0.9 టీఎంసీల నీరు అందుబాటు లో ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో తాగునీరు అవసరాలకు 0.6 టీఎంసీల నీటిని కేటాయించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉన్న నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ముందుకు అడుగులు వేస్తున్నామన్నారు. ఆయకట్టు పరిధిలోని చెరువులను నింపడంతో పాటు, బోర్లు రీఛార్జ్ అయ్యేలా తొలి విడతగా కాల్వల ద్వారా నీటిని విడుదల చేశామన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆరుతడి పంటల వైపే రైతులు మొగ్గు చూపాలని జిఎంఆర్ రైతులకు ఎమ్మెల్యే సూచించారు. సాధారణంగా కాలువలకు నీటిని విడుదల చేయాలంటే కనీసం 1.5 టిఎంసిల నీరు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న నీటి లభ్యతను దృష్టిలో రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కాల్వల ద్వారా సాగు విడుదల చేశామన్నారు. దీంతో, రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని అన్నారు.
కోయిల్ సాగర్ ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల నుంచి సాగునీరు విడుదల.
323
previous post