Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Telangana సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

by CVR NEWS

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం పూర్తిగా విఫలమైందని హెచ్‌ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సిద్ధంశెట్టి సాజన్ ఆరోపించారు. యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తూ కార్మిక సమస్యల పరిష్కారం కంటే పైరవీలకే పరిమితమైందని విమర్శించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత కొన్ని నెలలుగా సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహణ లేక అనేక మంది కార్మిక వారసులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. మెడికల్ బోర్డు నిర్వహణలో జాప్యంపై హెచ్‌ఎంఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత నిరహార దీక్షకు హెచ్చరించడంతోనే ప్రభుత్వం స్పందించిందని పేర్కొన్నారు.

ఇటీవల నిర్వహించిన మెడికల్ బోర్డులో కేవలం 20 శాతం మంది కార్మికులను మాత్రమే అన్‌ఫిట్‌గా గుర్తించి.. అర్హులైన అనేక మందిని విస్మరించారని ఆరోపించారు. దీనిపై గుర్తింపు సంఘం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. తక్షణమే మరోసారి మెడికల్ బోర్డు నిర్వహించి అర్హులైన కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే హెచ్‌ఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: