Friday, October 16, 2026
News Navigation
Friday, October 16, 2026
News Navigation

Breaking

Friday, October 16, 2026
Home Telangana భూకబ్జాలపై బండి సంజయ్ సంచలన ఆరోపణలు.

భూకబ్జాలపై బండి సంజయ్ సంచలన ఆరోపణలు.

by CVR NEWS

తెలంగాణ రాజకీయాల్లో భూకబ్జాల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వేల ఎకరాల భూములను కబ్జా చేశారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. భూముల కబ్జాలపై చర్యలు తీసుకోవడానికి సీఎం రేవంత్‌రెడ్డికి వెయ్యి రోజులు పట్టిందా అంటూ ప్రశ్నించారు.

డ్రగ్స్ కేసు, ఫార్ములా-ఈ కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఫాంహౌస్ కేసులపైనా బండి సంజయ్ ప్రశ్నలు సంధించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ వ్యవహారాల్లో ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. సంబంధిత కేసులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.

బీఆర్ఎస్‌కు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలపై ఉన్న భూకబ్జా ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని బండి సంజయ్ కోరారు. కాగా, ఈ ఆరోపణలపై సంబంధిత నేతలు, బీఆర్ఎస్ తరఫున స్పందన వెలువడాల్సి ఉంది. భూకబ్జాల దర్యాప్తు అంశంపై రాజకీయ పార్టీల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: