Friday, October 16, 2026
News Navigation
Friday, October 16, 2026
News Navigation

Breaking

Friday, October 16, 2026
Home Latest News నేడు హైదరాబాద్‌కు ఉపరాష్ట్రపతి రాక.

నేడు హైదరాబాద్‌కు ఉపరాష్ట్రపతి రాక.

by CVR NEWS

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే అధికారిక వేడుకలకు ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇవాళ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే వేడుకల్లో పాల్గొంటారు.

పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి తదితర ప్రముఖులు హాజరుకానున్నారు.

ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రత, రవాణా, వైద్య ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్‌తో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భారత యూనియన్‌లో హైదరాబాద్ స్టేట్ విలీనమైన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ అధికారిక వేడుకలను నిర్వహిస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: