Friday, October 16, 2026
News Navigation
Friday, October 16, 2026
News Navigation

Breaking

Friday, October 16, 2026
Home Latest News తెలంగాణలో సెమీకండక్టర్‌ పరిశ్రమకు సింగపూర్‌ సిద్ధం

తెలంగాణలో సెమీకండక్టర్‌ పరిశ్రమకు సింగపూర్‌ సిద్ధం

by CVR NEWS

తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు సింగపూర్‌ ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం తెలిపింది. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయిన ప్రతినిధులు.. రాష్ట్రంలో పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు. మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి ప్రణాళికలను సీఎం వారికి వివరించారు.

మూసా, ఈసా నదుల సంగమం నుంచి గాంధీ సరోవర్‌ వరకు తొలిదశలో మూసీ పునరుజ్జీవనం చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు. రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధితో పాటు నైట్‌ ఎకానమీని ప్రోత్సహించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. హైదరాబాద్‌ను పర్యాటక నగరంగానే కాకుండా నాలెడ్జ్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని.. ప్రముఖ అంతర్జాతీయ విద్యాసంస్థలు హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్‌ క్యాంపస్‌ల ఏర్పాటుకు అంగీకరించాయని వివరించారు.

ఫ్యూచర్‌ సిటీని నెట్‌ జీరో సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని సీఎం వెల్లడించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సహకారం అందించాలని సింగపూర్‌ ప్రతినిధులను కోరారు. పెట్టుబడులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. డిసెంబరులో ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు సింగపూర్‌ ప్రతినిధులను సీఎం ఆహ్వానించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: