Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Latest News దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది..

దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది..

by CVR NEWS

దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రతిష్టాత్మక బిల్లు, కావాల్సిన మెజార్టీ సాధించలేక వీగిపోయింది. తాజాగా జరిగిన ఓటింగ్‌లో ప్రభుత్వం నిర్దేశించుకున్న మ్యాజిక్ ఫిగర్ ను అందుకోవడంలో విఫలమైంది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభలో హాజరైన సభ్యులలో మూడింట రెండొంతుల మెజార్టీ తప్పనిసరి. అయితే బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు మాత్రమే పోలవ్వగా.. వ్యతిరేకంగా 230 ఓట్లు నమోదయ్యాయి. బిల్లు పాస్ కావాలంటే 352 ఓట్లు తప్పనిసరి కావడంతో బిల్లులు వీగిపోయాయి.

అధికార ఎన్డీయే కూటమి చిన్న పార్టీలను, మరియు తటస్థ ఎంపీలను ఆకర్షించేందుకు ప్రయత్నించినప్పటికీ, మేజిక్ ఫిగర్‌కు కావాల్సిన మరో 60-70 ఓట్లను కూడగట్టలేకపోయింది. దీంతో మహిళా బిల్లుకు అనుకూలంగా ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ, రాజ్యాంగ నిబంధనల ప్రకారం కావాల్సిన మూడింట రెండొంతుల బలం లేకపోవడంతో స్పీకర్ ఈ బిల్లు వీగిపోయినట్లు ప్రకటించారు. మొదటి నుంచి డీలిమిటేషన్ అంశాన్ని వ్యతిరేకిస్తున్న ఇండియా కూటమి పార్టీలు అనుకున్నట్లుగానే ఓటింగ్‌లో ఐక్యంగా నిలిచాయి.

Advertisements

You may also like

Our Visitor

014995
Total views : 81448

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.