ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలుకు రంగం సిద్ధం . ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను గనులశాఖ రూపొందించింది. ఈ నెల 8 నుంచి నూతన మార్గదర్శకాలను అమలు చేయనుంది. ఇకపై ఇసుక తవ్వకాలు, రవాణా నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది.
గత ప్రభుత్వం టన్ను ఇసుకను 475 రూపాయల చొప్పున విక్రయించింది. అందులో కాంట్రాక్టర్ చేపట్టే తవ్వకాలు, రవాణా ఖర్చు 100 రూపాయలు తీసేయగా మిగిలిన 375 రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరేది. కానీ ఇక నుంచి 375 కాకుండా 88 రూపాయలు మాత్రమే వసూలు చేయనున్నారు. పైగా ఆ సొమ్ము కూడా స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాల్లోనే జమ కానుంది.అలాగే సీనరేజి చార్జీ కింద ప్రతి టన్నుకు వసూలు చేసే 66 రూపాయలు జిల్లా, మండల పరిషత్తులు, పంచాయతీలకు అందనుంది.
జిల్లా ఖనిజ నిధి కింద 19 రూపాయల 80 పైసలు చొప్పున వసూలయ్యే మొత్తం ఇసుక రీచ్ ల అభివృద్ధికి జిల్లా ఖాతాలో జమ కానుంది. ఖనిజాన్వేషణ నిధి కోసం వసూలు చేసే మిగతా రూపాయి 32 పైసలు గనుల శాఖలో ఖనిజాన్వేషణ ట్రస్ట్ ఖాతాలోకి వెళ్లనుంది. మొత్తంగా చూస్తే నూతన విధానంలో ఇసుక కొనుగోలుదారులకు ఇకపై ప్రతి టన్నుపై 287 ఆర్థికభారం తగ్గనుంది. ఈ నెల 8 నుంచి నిల్వ కేంద్రాల్లో ఇసుక విక్రయాలు చేసినప్పుడు టన్నుకు 88 రూపాయలతో పాటు ఆ నిల్వ కేంద్రానికి ఏ రీచ్ నుంచి ఇసుక తవ్వి, తీసుకొచ్చారో ఆ రవాణా వ్యయం, స్టాక్ పాయింట్లో లోడింగ్ అయ్యే ఖర్చు తీసుకోనున్నారు. ఈ రేట్‌ను కలెక్టర్లు ఖరారు చేస్తారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జమ్ము మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం..జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పై హత్యాయత్నం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం సురీందర్ తో కలిసి ఓ పెళ్లి వేడుకకు వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా. ఈ సందర్భంగా ఫరూఖ్ అబ్దుల్లాకు భారీ భద్రత ఉంది.…
- ఆర్ అండ్ బీ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష .రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని దీర్ఘకాలిక దృష్టితో ముందుకు తీసుకెళ్లాలని, 2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధి…
- ఫుడ్స్ పెట్టలేమంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు సర్క్యులర్ జారీ చేశాయి.పశ్చిమాసియా యుద్ధ సెగ ఐటీ ఉద్యోగులకు తగిలింది. ఫుడ్స్ పెట్టలేమంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు సర్క్యులర్ జారీ చేశాయి. ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా హైదరాబాద్ హాస్టల్ యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయని తెలిపాయి. కేవలం ముఖ్యమైన ఆహార…
- పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రభుత్వం ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ పార్లమెంటులో వెల్లడించిన సమాచారం ప్రకారం,…
- సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది.సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం వారికి పలు అంశాలపై లక్ష్యాలను నిర్దేశించారు. సంక్షేమ, అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. అధికారులు-ప్రజాప్రతినిధుల…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి