భారత రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎందరో మహానుభావులు కలిసి మన రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు. రాజ్యంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో మోదీ మాట్లాడారు. ప్రజాస్వామ్య పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నామని, ఇవి దేశం గర్వపడే క్షణాలని అన్నారు. రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో రకాలుగా ప్రయత్నించిందని విమర్శించారు. దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిదని.. దేశ అధ్యక్షురాలిగా ఆదివాసీ మహిళ ఎన్నికయ్యారని మోదీ తెలిపారు. ఈ దేశాన్ని వికసిత్ భారత్‌గా మార్చాలి. ప్రజల మధ్య ఐకమత్యం.. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మనదేశ గొప్ప విధానమని.. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వార్థపరుల వల్ల అనేక కష్టాలు అనుభవించామని ఆవేదన వ్యక్తం చేశారు. బానిస మనస్తత్వంతో ఉన్నవాళ్లు దేశాభివృద్ధికి ఆటంకం కలిగించారని.. దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు విషబీజాలు నాటారని మోదీ ఫైర్ అయ్యారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కొత్తగూడెం మేయర్‌గా ఎన్నికైన CPI అభ్యర్థి గణేష్కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధికి కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామని.. CPI MLA కూనమనేని సాంబశివరావు అన్నారు. మేయర్‌గా ఎన్నికైన గణేష్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ఒప్పందంలో భాగంగా మొదటి రెండున్నరేళ్లు తాము మేయర్ పీఠంలో ఉండామని వెల్లడించారు. పేదల…
- శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలుశ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం లో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు నిర్వహించిన లింగోద్భవ దర్శనం ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట్ సుధీర్ రెడ్డి దంపతులు, దేవస్థానం…
- పెద్దపల్లి జిల్లాలో కొలువుదీరనున్న కొత్త పాలకవర్గంపెద్దపల్లి జిల్లాలో కొత్త పాలకవర్గం నేడు కొలువుదీరనుంది. రామగుండం మేయర్, పెద్దపల్లి , మంథని మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. అయితే పోటీ తీవ్రంగా నెలకొనడంతో సుల్తానాబాద్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను…
- మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆసక్తికర పరిణామాలుమున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు తామిచ్చిన డబ్బును తిరిగివ్వాలంటూ ఓటర్లను డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మేడ్చల్‌లో డబ్బులు తిరిగివ్వమని అడిగిన అభ్యర్థి భర్తపై తిరగబడ్డారు ఓటర్లు. ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని బండమాచారం19వ వార్డులో పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థి ఓటమి…
- ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావులఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల .ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3 లక్షల 32 వేల 205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. తమ దృష్టిలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి