Thursday, March 12, 2026
News Navigation

Breaking

Thursday, March 12, 2026
Home Telangana కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో వీధి కుక్కల బీభత్సం

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో వీధి కుక్కల బీభత్సం

by Satya
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో వీధి కుక్కల బీభత్సం

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో వీధి కుక్కల బీభత్సం. నిన్న సాయంత్రం నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు 40 మందిపై దాడి చేశాయి. అందులో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే కుక్కలను పట్టుకునేందుకు మునిసిపల్ సిబ్బంది డాగ్ క్యాచ్ బ్యాచ్ ప్రయత్నించగా మునిసిపల్ సిబ్బందిపై ఓ కుక్క దాడికి పాల్పడింది. మున్సిపల్ సిబ్బంది సైతం నలుగురు గాయపడ్డారు. స్థానికులు మున్సిపల్ సిబ్బంది కలిసి పిచ్చికుక్కను కర్రలతో కొట్టి చంపారు. మరోవైపు మున్సిపల్ ఆధ్వర్యంలో కుక్కలు పట్టే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. హైదరాబాద్ నుంచి రప్పించిన డాగ్ స్క్రాచ్ బ్యాచ్ కుక్కల వేట కొనసాగిస్తుంది. ఇప్పటికే 500 కుక్కలను పట్టుకొని అటవి ప్రాంతానికి తరలించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.