Sunday, August 16, 2026
News Navigation
Sunday, August 16, 2026
News Navigation

Breaking

Sunday, August 16, 2026
Home Telangana సైబరాబాద్ పరిధిలో మూడు కోట్ల మొబైల్ ఫోన్ల రికవరీ..

సైబరాబాద్ పరిధిలో మూడు కోట్ల మొబైల్ ఫోన్ల రికవరీ..

by Rama
సైబరాబాద్ పరిధిలో మూడు కోట్ల మొబైల్ ఫోన్ల రికవరీ..

సైబరాబాద్ పరిధిలో 3 కోట్ల 30 లక్షల విలువ చేసే 11 వందల మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2023 ఏప్రిల్ 20న కేంద్ర ప్రభుత్వం CEIR ప్రవేశపెట్టిందని డీసీపీ నర్సింహా తెలిపారు. అయితే దీనికి ఎక్కువగా మొబైల్స్ చోరీకి సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా వచ్చాయన్నారు. మొబైల్ పోగొట్టుకున్న వాళ్లే.. CEIR లో ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించారు. ఫోన్ పోయిన వెంటనే CEIR లో ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత మొబైల్ ట్రేస్ అవుతుందని…అప్పుడు ఫోన్ ఎక్కడ ఉందనేది సులభంగా పట్టుకోగలుగుతున్నామని డీసీపీ తెలిపారు. ఈ సంవత్సరంలో నాల్గవ సారి మొబైల్స్ ను రికవరీ చేశామన్నారు. సైబరాబాద్ పరిధిలోని 45 పోలీస్ స్టేషన్ల పరిధిలో అందరూ కష్టపడటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. సైబరాబాద్ పరిధిలో మొత్తం 7500 ఫోన్లు రికవరీ చేశామి.. ఈ సంవత్సరం 5వేల 5వందల ఫోన్లు రికవరీ చేశామని తెలిపారు విలువైన వస్తువులు తీసుకెళ్లేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డీసీపీ నర్సింహా సూచించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
    ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర–2047 థీమ్‌తో రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.సీడ్ యాక్సెస్ రోడ్డు…
  • ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.
    దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ చరిత్రలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ గేయాన్ని పూర్తిస్థాయిలో ఆలపించడం…
  • టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.
    టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే యాడ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ ఛానెళ్లలో ప్రతి గంటకు గరిష్టంగా 12 నిమిషాల వాణిజ్య ప్రకటనల ప్రసారానికే పరిమితం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం విధించిన నిబంధనను తొలగిస్తూ కేంద్ర…
  • ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.
    ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైందని, ఫ్లోరెస్ ప్రాంతంలోని ఎండే నగరానికి 68 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదైందని అంతర్జాతీయ భూభౌతిక కేంద్రాలు…
  • నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .
    తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు చెప్పింది. పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ తదితర యూనిఫాం సర్వీసుల ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్ల పాటు పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: