Sunday, April 12, 2026
News Navigation
Sunday, April 12, 2026
News Navigation

Breaking

Sunday, April 12, 2026
Home Film ‘టిల్లు స్క్వేర్’ కి అదిరిపోయే రెస్పాన్స్…

‘టిల్లు స్క్వేర్’ కి అదిరిపోయే రెస్పాన్స్…

by Prakash
tillu square review


మొదటి షో నుంచే ‘టిల్లు స్క్వేర్’ సినిమాకి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు: చిత్ర బృందం

‘టిల్లు స్క్వేర్'(Tillu Square Review) వంద కోట్లు వసూలు చేస్తుంది : చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ

2022లో విడుదలై ఘన విజయం సాధించిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం ‘టిల్లు స్క్వేర్'(Tillu Square). స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మల్లిక్‌ రామ్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్‌ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. భారీ అంచనాలతో ‘టిల్లు స్క్వేర్’ సినిమా నేడు(మార్చి 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో నవ్వులు పూయిస్తూ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ తెచ్చుకున్న ఈ సినిమా సంచలన వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ఈ విజయానందంలో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం తమ సంతోషాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ సందర్భంగా కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) మాట్లాడుతూ..

” ముందుగా నేను నిర్మాత నాగవంశీ గారికి, చినబాబు గారికి, త్రివిక్రమ్ గారికి థాంక్స్ చెప్పాలి. నన్ను నమ్మి, ఇలాంటి సబ్జెక్టుని నమ్మి, మంచి బడ్జెట్ తో ‘డీజీ టిల్లు’ చిత్రాన్ని రూపొందించారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత సీక్వెల్ అవకాశం కూడా ఇచ్చారు. టిల్లు స్క్వేర్ కి థియేటర్లలో మంచి స్పందన లభిస్తుండటం ఆనందం కలిగిస్తోంది. విడుదలకు ముందే ఈ సినిమా అదిరిపోతుంది అని నాకు తెలుసు. కానీ విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి ఆ మాట వినాలని ఆగాను. ఇప్పుడు చెబుతున్నాను ఈ సినిమా అదిరిపోయింది. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.” అన్నారు.

కథానాయిక అనుపమ పరమేశ్వరన్(Anupama) మాట్లాడుతూ..

“ఆనందంలో మాటలు కూడా రావడంలేదు. ఈ సినిమా ప్రయాణాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఈ చిత్రం చేసే సమయంలో ప్రతి క్షణం ఎంజాయ్ చేశాను. ఇప్పుడు సినిమాకి మంచి స్పందన లభిస్తోంది. నా పాత్రకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. నేను మొదటిసారి ఇలాంటి పాత్ర పోషించాను. అయినప్పటికీ నేను పోషించిన లిల్లీ పాత్ర నాకు మొదటి నుంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకం నిజమై, ఇప్పుడు నా పాత్రకు వస్తున్న స్పందన చూసి సంతోషంగా ఉంది” అన్నారు.

దర్శకుడు మల్లిక్ రామ్ మాట్లాడుతూ..

“మొదటి షోకే అన్ని ప్రాంతాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మేము ముందు నుంచి అనుకున్నట్టుగానే.. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు.” అన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందనే నమ్మకం ఉంది. సినిమాకి మంచి టాక్ వస్తోంది. మార్నింగ్ షోకి, మ్యాట్నీకి వసూళ్లలో గ్రోత్ కనిపిస్తుంది. ఉగాది, రంజాన్ పండగలు, వేసవి సెలవులు ఉండటంతో ఈ సినిమా వంద కోట్లు వసూలు చేస్తుందనేని నమ్ముతున్నాను.” అన్నారు.

ఈ కార్యక్రమంలో కళ్యాణ్ శంకర్, రవి ఆంథోనీ, ప్రణీత్ రెడ్డి తదితరులు పాల్గొని తమ సంతోషాన్ని పంచుకున్నారు.


లీకైన జననాయగన్‌ సినిమా ..
చెన్నైలో టీవీకే అధినేత విజయ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమైన …
ఒక సినిమా ఒక దేశాన్ని మానసికంగా కుదిపేస్తుందా?
ఒక సినిమా ఒక దేశాన్ని మానసికంగా కుదిపేస్తుందా? ఒక కథ ఆ సమాజంలో అనుమానాల అగ్నిని …
తెలుగు చిత్ర పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి చేరింది.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ నేడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది, హాలీవుడ్ స్థాయికి ఎదిగిందని …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

004899
Total views : 33620

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.