Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Andhra Pradesh నేడు మధ్యాహ్నం కోయంబత్తూరుకు సీఎం చంద్రబాబు..

నేడు మధ్యాహ్నం కోయంబత్తూరుకు సీఎం చంద్రబాబు..

by CVR NEWS

సీఎం చంద్రబాబు తమిళనాడు ఎన్నికల క్షేత్రంలో అడుగుపెడుతున్నారు. నేడు మధ్యాహ్నం అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన కోయంబత్తూరుకు బయలుదేరుతారు. అక్కడ నుంచి ఆయన రెండు రోజుల బిజీ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ముఖ్యంగా తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, ఆవడి నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. హోసూరు సమీపంలోని తాలిలో నిర్వహించే భారీ బహిరంగ సభ ఈ పర్యటనలో హైలైట్‌గా నిలవనుంది. ఇక్కడ తెలుగు మాట్లాడే ఓటర్లు కీలకం కావడంతో, బాబు ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అనంతరం చెన్నై సమీపంలోని ఆవడిలో భారీ రోడ్ షోలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఎందుకు గెలవాలి? జాతీయ స్థాయిలో మోదీ నాయకత్వం, ప్రాంతీయంగా కూటమి బలోపేతం వంటి అంశాలను ఆయన ప్రజలకు వివరించనున్నారు. చంద్రబాబు రాకతో తమిళనాడులోని సరిహద్దు జిల్లాలు, చెన్నై మెట్రోలోని తెలుగు ఓటర్లు ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే హోసూరు, కోయంబత్తూరు ప్రాంతాల్లో టీడీపీ, ఎన్డీఏ శ్రేణులు భారీ ఫ్లెక్సీలు, తోరణాలతో పండుగ వాతావరణాన్ని తలపించేలా స్వాగత ఏర్పాట్లు పూర్తి చేశాయి.

Advertisements

You may also like

Our Visitor

014997
Total views : 81456

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.