అంతర్జాతీయ వర్తకంలో డాలర్‌కు ప్రత్యామ్నాయం లేదన్నారు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. డాలర్‌ను దూరంపెట్టే ప్రయత్నాలు చేసే దేశాలు అమెరికాతో వర్తకానికి కూడా దూరం కావాల్సిందేనని హెచ్చరించారు. ఈ మేరకు బ్రిక్స్ దేశాలు ఇండియా, బ్రెజిల్, చైనా, రష్యా, సౌతాఫ్రికాలకు నేరుగా వార్నింగ్ ఇచ్చారు. అంతర్జాతీయ లావాదేవీలకు డాలర్ స్థానంలో మరో కరెన్సీ వాడాలని ఇటీవల బ్రిక్స్ దేశాలు నిర్ణయించడంతో.. డాలర్‌కు ప్రత్యామ్నాయం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. డాలర్ స్థానంలో వేరే కరెన్సీని ఉపయోగించే దేశాలపై పన్నులు పెంచుతామని చెప్పారు. అమెరికాకు ఆయా దేశాలు ఉత్పత్తి చేసే వస్తువులపై పన్నులు 100 శాతం పెంచుతామని స్పష్టం చేశారు. బ్రిక్స్ దేశాల ప్రయత్నాలను తాము ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటామని, డాలర్‌కు దూరంగా జరిగే దేశాలకు అమెరికా ఆర్థిక వ్యవస్థలో చోటుండదని హెచ్చరించారు డొనాల్డ్ ట్రంప్.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ..ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు సీఎం రేవంత్‌రెడ్డి. డీలిమిటేషన్‍తో సౌత్ స్టేట్స్‌తో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఈ నిర్ణయంతో బీజేపీకి తాత్కాలికంగా లాభం జరగవచ్చు కానీ..దీర్ఘకాలంలో దేశానికి నష్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి..ఈ మేరకు డీలిమిటేషన్ విషయంలో…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు రావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. ప్రస్తుతం దర్శనానికి సుమారు…
- భారత భూభాగాలకు చైనా కల్పిత పేర్లు..అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా కల్పిత పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. చైనా చర్య దురుద్దేశపూరితమంటూ మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో విడదీయలేని అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. కల్పిత పేర్లు పెట్టడం ద్వారా వాస్తవాలను మార్చలేరని స్పష్టం చేసిన…
- హైదరాబాద్‌లో అంతులేకుండా పోతున్న రియల్ మోసాలు..హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ సంస్థల ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. చిన్న చితకా సంస్థల నుంచి మొదలుపెట్టి… బడా బడా కన్‌స్ట్రక్షన్ కంపెనీల వరకూ అందరూ నిబంధనలను తుంగలో తొక్కేవారే. కొంచెం ఎక్కువ… కొంచం తక్కువ అనే తప్ప… ఉల్లంఘనలకు…
- పశ్చిమాసియాలో మళ్లీ మొదటికొచ్చిన పరిస్థితి..పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పాకిస్థాన్ వేదికగా అమెరికా – ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో… మళ్లీ యుద్ధం మొదలయ్యే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ దిశగా ట్రంప్ అనేక సూచనలు కూడా ఇచ్చారు. దీంతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 38406