వెస్ట్ బెంగాల్ సీఎం ఎవరనే సస్పెన్స్ కు తెరపడింది. ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పేరు ఖరారైంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 294 స్థానాలకు 207 స్థానాల్లో గెలిచింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఒడిశా సీఎం సమక్షంలో జరిగిన ఈ శాసనసభాపక్ష నేత ఎన్నిక కార్యక్రమంలో బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారిని ఎన్నుకున్నారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేత సువేందు అధికారి పేరును భట్టాచార్య ప్రతిపాధించారు. ఎట్టకేలకు బెంగాల్ సీఎం ఎవరనే ఉత్కంఠకు తెర పడింది. అలాగే తొలిసారి బెంగాల్ లో ఇద్దరు డిప్యూటీ సీఎంలకు అవకాశం కల్పిస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కోల్ కత్తాలోని పరేడ్ గ్రౌండ్‌లో సువేందు అధికారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటు, ఎన్డీయే కూటమిలోని సీఎం ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు
పశ్చిమ బెంగాల్ లో రేపు కొలువుదీరనున్న కొత్త సర్కార్..
120
previous post






Total views : 143628