మహిళా రిజర్వేషన్ బిల్లులో OBC మహిళలకు ప్రత్యేక కోటా లేకపోవడాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ఓబిసిలు, దళితులను హిందువులని పిలుస్తూనే, దేశ వ్యవస్థల్లో వారికి సరైన స్థానం కల్పించడం లేదని ఆయన విమర్శించారు. కుల గణనను ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. ఓబిసిలు, దళితులను హిందువులని పిలుస్తూనే, దేశ వ్యవస్థల్లో వారికి సరైన స్థానం కల్పించడం లేదని ఆరోపించారు.
అయితే రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉండి ప్రధానిని ఉద్దేశించి రాహుల్ ఇలా మాట్లాడడం కొత్త ఎంపీలకు ఏం నేర్పిస్తుందని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ పదేపదే సభను తప్పుదారి పట్టిస్తున్నారని, స్పీకర్ ఎన్నిసార్లు వారించినా పద్ధతి మార్చుకోవడం లేదని విమర్శించారు. కుల గణన మరియు మహిళా రిజర్వేషన్లలోని ఇతర సాంకేతిక అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూర్తిస్థాయిలో సమాధానం ఇస్తారని చెప్పినా..రాహుల్ వినకుండా రచ్చ చేయడం మంచిదికాదని హితవు పలికారు.





Total views : 81456