మీ జాతకంలో కేతుగ్రహ దోషం వున్నప్పుడు మీరు తప్పకుండా తెల్లజిల్లేడుతో చేసిన గణపతిని తప్పకుండా ప్రతి మంగళవారం, గురువారం,ఆదివారం రోజున
గరికతో, బెల్లంతో లేక బెల్లెతో చేసిన నైవేద్యాలతో గణపతిని పూజించాలి. కేతువు జాతకంలో బలహీనంగా ఉన్నపుడు మానసిక బలహీనతలు, అతిభక్తి, జీవితం మీద విరక్తి, ఎకాంతంగా ఉండాలనే కోరిక, లేనివి ఉన్నట్లు ఊహించుకోవడం, తనలో తానే ఊహించుకొనుట, తనని తాను దేవుడు గానో దేవతగానే ఊహించుకోవడం, దేనిని చూసినా భయపడడం, ఉద్యోగమును, భార్యా పిల్లలను వదలి దేశ సంచారం చేయుట. పిచ్చివారిగా ప్రవర్తించుట, విచిత్ర వేషధారణతో వుండటం, సంతానం కలుగకపోవుట, గర్భం వచ్చి పోవుట, చిన్న పిల్లలకు తీవ్ర అనారోగ్యం, అంటు వ్యాధులు, వైద్యులు కూడా గుర్తించలేని విచిత్ర వ్యాధులకు కేతువు కారణం సంభవిస్తాయి. కేతు గ్రహ అనుగ్రహం కొరకు నలుపు తెలుపు గళ్లతో ఉన్న కంబళి దానం చేయుట. దేవాలయ నిర్మాణాలకు విరాళాలు ఇవ్వటం. పిచ్చి ఆసుపత్రిలో రోగులకు సేవ చేయుట. అనాధ పిల్లలను చేరదీసి వారికి భోజన సదుపాయము కలిగించుట. పేదవారికి మందులు కొని ఇవ్వటం, వైఢూర్యం గాని తొమ్మిది ముఖములు గల రుద్రాక్ష ధరించుట వలన కేతు గ్రహ అనుగ్రహం లభిస్తుంది, ఇప్పుడు వివరించినదోషాలు తొలగి సుఖ జీవితం లభిస్తుంది.
Read Also..
Read Also..