పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన యుద్ధం అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తోంది. గిఫ్ట్ నిఫ్టీ పతనం నేపథ్యంలో ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మళ్లీ మొదలైన కలకలం..దలాల్ స్ట్రీట్‌పై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో గ్లోబల్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. నిన్నటి లాభాల నుంచి భారత మార్కెట్లు ఇవాళ నష్టాల్లోకి మారే సూచనలు కనిపిస్తున్నాయి.
గిఫ్ట్ నిఫ్టీ నిన్నటి ముగింపు కంటే దాదాపు 59 పాయింట్ల నష్టంతో 23 వేల 272 వద్ద ట్రేడవుతోంది. దీంతో దేశీయ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ప్రతికూలంగా ప్రారంభం కానున్నాయని సూచిస్తోంది. ఇదిలా ఉంటే..నిన్న సెన్సెక్స్ 394 పాయింట్లు లాభపడి 73 వేల 918 వద్ద, నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో 23 వేల 242 వద్ద స్థిరపడ్డాయి. అయితే, తాజా అంతర్జాతీయ పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. హార్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా, ఇరాన్ దాడులు, ప్రతిదాడులతో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఈ తీవ్ర ఉద్రిక్తతల కారణంగా పశ్చిమాసియాలో శాంతి చర్చల ఆశలు అడుగంటాయి. దీంతో యూఎస్ మార్కెట్లలో టెక్ షేర్లు భారీగా నష్టపోయాయి. నాస్డాక్ 0.97 శాతం పడిపోగా ఎస్అండ్పీ 5 హండ్రెడ్ సైతం 0.26% క్షీణించింది. డౌ జోన్స్ మాత్రం 0.17% లాభపడింది. మరోవైపు ఆసియాలో దక్షిణ కొరియా ఇండెక్స్ కోస్పీ ఏకంగా 3.12% పతనమవగా, జపాన్ నిక్కీ 0.81% నష్టపోయింది. హాంకాంగ్ హ్యాంగ్‌సెంగ్ సైతం నష్టాల బాటలోనే పయనిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ మన మార్కెట్లు ఎలా ట్రేడయ్యే అవకాశముందన్న అంశంపై విశ్లేషణ ఇప్పుడు చూద్దాం..
1.నిన్న లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు ఇవాళ ఎలా ప్రారంభమయ్యే అవకాశముంది?
2.బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు నిన్నటి మార్కెట్‌కు మద్దతిచ్చిన నేపథ్యంలో ఇవాళ ఎలా ఉండే ఛాన్సుందంటారు?
3.ఐటీ, టెలికాం షేర్లు ఇవాళ ఎలా డ్రేడయ్యే అవకాశముంది?




Total views : 140766