ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతికతతో పాటు ఇతర కీలక రంగాల్లో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, టెక్ దిగ్గజం గూగుల్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఇరుపక్షాల సమన్వయంతో ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండు రోజుల సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు గూగుల్ ఆసియా-పసిఫిక్ రీజియన్ అధ్యక్షుడు కరణ్ బజ్వాతో సమావేశమయ్యారు. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ గవర్నెన్స్ వంటి అంశాలలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద ఏఐ మరియు డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని గూగుల్ ప్రతినిధులకు సీఎం విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ సేవల్లో ఏఐ వినియోగానికి, ‘సంజీవని’ ప్రాజెక్టు అమలుకు సాంకేతిక భాగస్వామ్యం కావాలని కోరారు. రాష్ట్ర యువతకు ఏఐ, క్లౌడ్ టెక్నాలజీ రంగాలలో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు ప్రతిపాదించారు. తన పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి లాజిస్టిక్స్ రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వైసీహెచ్ లాజిస్టిక్స్ గ్రూప్ ప్రతినిధులతో భేటీ అయి, రాష్ట్రంలో సప్లై చైన్ మరియు లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీరరేఖ, పోర్టులు మరియు మెరుగైన కనెక్టివిటీ వంటి మౌలిక వసతులను వివరిస్తూ పెట్టుబడులకు ఆహ్వానించారు. మరోవైపు, యూఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌తోనూ సమావేశమైన సీఎం, రాష్ట్రంలో యూఎన్ హాబిటాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు చొరవ చూపారు. పట్టణ ప్రాంతాల సుస్థిర అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందించాలని కోరారు.
Business
ప్రముఖ వ్యాపార దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఆయనకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్ఎక్స్’అమెరికా స్టాక్ మార్కెట్లో భారీ ఐపీఓగా లిస్ట్ అయిన తర్వాత, ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన మొదటి ‘ట్రిలియనీర్‌గా అవతరించారు. ఎలాన్ మస్క్ సంపద సరికొత్త రికార్డు స్థాయికి చేరింది. తాను స్థాపించిన రాకెట్ల తయారీ కంపెనీ స్పేస్ఎక్స్ షేర్ల లిస్టింగ్‌తో ఆయన వ్యక్తిగత ఆస్తి విలువ లక్ష కోట్ల డాలర్లు దాటేసింది. దాంతో ఆయన ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా అవతరించారు. కనీసం లక్ష కోట్ల డాలర్ల సంపద కలిగిన వ్యక్తిని ట్రిలియనీర్ అంటారు. మిగతా సంపన్నులు ఈ ఘనతను సాధించేందుకు మరి కొన్నేళ్లు పట్టవచ్చు. ఎందుకంటే, బ్లూంబర్గ్ వరల్డ్ రిచ్ లిస్ట్‌లో రెండో స్థానంలో ఉన్న గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్ నెట్‌వర్త్ 30,400 కోట్ల డాలర్లు. అంటే, మస్క్ సంపదలో మూడోవంతే. అంతేకాదు, ప్రపంచ టాప్-5 కుబేరుల్లోని మిగతా నలుగురి కంటే మస్క్ సంపదే అధికం. తైవాన్, ఐర్లాండ్, స్వీడన్ దేశాల జీడీపీ కంటే కూడా ఎక్కువే.
స్టాక్ మార్కెట్లో అరంగేట్రం చేసిన వెంటనే స్పేస్ఎక్స్ షేర్లు భారీగా పెరగడంతో ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే ఫస్ట్ ట్రిలియనీర్ అయ్యారు. స్టాక్ మార్కెట్లోకి అలా, స్పేస్ఎక్స్ షేర్ల విడుదల మస్క్‌ను ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్‌గా నిలబెట్టింది.స్పేస్ఎక్స్ షేర్లు ఓపెన్ స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించి, వెంటనే ఒక్కో షేరు సుమారు 150 డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 15వేల రూపాయల ధరకు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత షేరు ధర వేగంగా 160 డాలర్లకు పెరిగింది. స్పేస్ఎక్స్ పంచుకున్న అంచనా లిస్టింగ్ ధర 135 డాలర్లకంటే, షేర్లు 160 డాలర్లకు అంటే 18శాతం అధిక ధరకు అమ్ముడవుతున్నాయి. షేరు విలువ 160 డాలర్లు దాటడంతో కంపెనీ మార్కెట్ విలువ కూడా 2 లక్షల కోట్ల డాలర్ల మైలురాయిని అధిగమించేసింది. ఒక దశలో 2.30 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. దాంతో స్పేస్‌ఎక్స్‌లోని మస్క్ ఈక్విటీ వాటా విలువ 82,000 కోట్ల డాలర్లు దాటేసింది. తన విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా వాటా విలువ 28,000 కోట్ల డాలర్లతో కలిపి మొత్తం నెట్‌వర్త్ 1.1 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది.
పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన యుద్ధం అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తోంది. గిఫ్ట్ నిఫ్టీ పతనం నేపథ్యంలో ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మళ్లీ మొదలైన కలకలం..దలాల్ స్ట్రీట్‌పై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో గ్లోబల్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. నిన్నటి లాభాల నుంచి భారత మార్కెట్లు ఇవాళ నష్టాల్లోకి మారే సూచనలు కనిపిస్తున్నాయి.
గిఫ్ట్ నిఫ్టీ నిన్నటి ముగింపు కంటే దాదాపు 59 పాయింట్ల నష్టంతో 23 వేల 272 వద్ద ట్రేడవుతోంది. దీంతో దేశీయ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ప్రతికూలంగా ప్రారంభం కానున్నాయని సూచిస్తోంది. ఇదిలా ఉంటే..నిన్న సెన్సెక్స్ 394 పాయింట్లు లాభపడి 73 వేల 918 వద్ద, నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో 23 వేల 242 వద్ద స్థిరపడ్డాయి. అయితే, తాజా అంతర్జాతీయ పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. హార్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా, ఇరాన్ దాడులు, ప్రతిదాడులతో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఈ తీవ్ర ఉద్రిక్తతల కారణంగా పశ్చిమాసియాలో శాంతి చర్చల ఆశలు అడుగంటాయి. దీంతో యూఎస్ మార్కెట్లలో టెక్ షేర్లు భారీగా నష్టపోయాయి. నాస్డాక్ 0.97 శాతం పడిపోగా ఎస్అండ్పీ 5 హండ్రెడ్ సైతం 0.26% క్షీణించింది. డౌ జోన్స్ మాత్రం 0.17% లాభపడింది. మరోవైపు ఆసియాలో దక్షిణ కొరియా ఇండెక్స్ కోస్పీ ఏకంగా 3.12% పతనమవగా, జపాన్ నిక్కీ 0.81% నష్టపోయింది. హాంకాంగ్ హ్యాంగ్‌సెంగ్ సైతం నష్టాల బాటలోనే పయనిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ మన మార్కెట్లు ఎలా ట్రేడయ్యే అవకాశముందన్న అంశంపై విశ్లేషణ ఇప్పుడు చూద్దాం..
1.నిన్న లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు ఇవాళ ఎలా ప్రారంభమయ్యే అవకాశముంది?
2.బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు నిన్నటి మార్కెట్‌కు మద్దతిచ్చిన నేపథ్యంలో ఇవాళ ఎలా ఉండే ఛాన్సుందంటారు?
3.ఐటీ, టెలికాం షేర్లు ఇవాళ ఎలా డ్రేడయ్యే అవకాశముంది?
భారత్‌కు అమెరికా ఊహించని షాక్ ఇచ్చింది. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం విడుదల చేసిన తాజా నివేదికలో భారత్‌ను దోషుల జాబితాలో చేర్చింది. ట్రేడ్ యాక్ట్-1974లోని సెక్షన్-301 కింద నిర్వహించిన దర్యాప్తుల్లో భారత్ సహా 54 దేశాలు బలవంతపు శ్రమతో తయారయ్యే వస్తువుల దిగుమతులను అరికట్టడంలో తగిన చర్యలు తీసుకోవడం లేదని యూఎస్‌టిఆర్ పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే పలు ఉత్పత్తులపై 10 నుంచి 12.5 శాతం వరకు అదనపు సుంకాలు విధించాలని ప్రతిపాదించింది. ఇప్పటికే పరిమిత ఆంక్షలు అమలు చేస్తున్న దేశాలకు 10 శాతం టారిఫ్ ఉండగా.. భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్ వంటి దేశాలకు గరిష్టంగా 12.5 శాతం సుంకం విధించే అవకాశం ఉందని తెలిపింది.
టెక్స్టైల్స్, వస్త్ర ఉత్పత్తుల విషయంలో మాత్రం ప్రత్యేక కోటా విధానంతో కొంత ఉపశమనం కల్పించేందుకు అమెరికా సిద్ధమైంది. అయితే ఈ ప్రతిపాదిత సుంకాలు అమలైతే భారత ఉత్పత్తుల ధరలు అమెరికా మార్కెట్లో పెరిగే అవకాశం ఉంది. దీంతో ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. న్యూఢిల్లీలో భారత్-అమెరికా ఉన్నతాధికారులు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కీలక చర్చలు జరుపుతున్న సమయంలోనే ఈ ప్రకటన వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతిపాదిత టారిఫ్‌లపై జులై తొలి వారం వరకు ప్రజాభిప్రాయ సేకరణ, సమీక్షలు నిర్వహించి.. అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు.
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 91 పైసల మేర పెరిగింది. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 0.87 పైసలు పెరిగి 99.54 రూపాలయకు చేరుకోగా, డీజిల్ ధర 0.91 పైసల మేర పెరిగి లీటరుకు రూ. 92.48గా నమోదైంది. దేశీయ ఎల్పిజి సిలిండర్ ధరలలో ఎటువంటి మార్పు లేదు, ఇది వినియోగదారులకు కొంత ఊరట కలిగించింది.
సరిగ్గా 10 రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది మూడోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తొలుత పెట్రోల్, డీజిల్ లీటర్ పై ఏకంగా రూ.3.50 పైసల మేర పెంచాయి ఆయిల్ కంపెనీలు. ఆ తర్వాత ఈ నెల 19వ తేదీన మళ్లీ వాటి రేట్లను సవరించాయి. లీటర్ పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 91 పైసలు పెంచాయి. ఇప్పుడు కూడా అవే రేట్లను ప్రాతిపదికన తీసుకున్నాయి. మళ్లీ అంతే మొత్తంలో ఇంధన రేట్లను సవరించాయి. దీంతో ప్రయాణం మరింత భారం కానుంది వాహనదారులకు. ఈ పెరుగుదల ఇప్పట్లో ఆగకపోవచ్చు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో రోజూ 1,000 కోట్ల రూపాయల మేర నష్టాన్ని చవి చూస్తూ వస్తోన్నామని చెబుతోన్నాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. దీన్ని భర్తీ చేసుకోవడానికి పెట్రోల్, డీజిల్ పై కనీసం 25 రూపాయలను పెంచాల్సి ఉంటుందనీ కేంద్రానికి ఇదివరకే ప్రతిపాదనలు సైతం పంపించాయి.
అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ఇంధన ధరల మంటల కారణంగా గత వారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. గత వారం రోజుల్లో సెన్సెక్స్ 2.70 శాతం, నిఫ్టీ 2.20 శాతం మేర పతనమయ్యాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 75 వేల 237 పాయింట్ల వద్ద, నిఫ్టీ 23 వేల 643 వద్ద స్థిరపడ్డాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా-ఇరాన్ వివాదం, రూపాయి విలువ అత్యంత కనిష్టానికి పతనమవడంతో మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు గురైంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర అంతకంతకూ పెరుగుతుండటం మార్కెట్లలో ఆందోళన పెంచింది. ఐతే రెండ్రోజుల తర్వాత ఇవాళ ప్రారంభమవుతున్న మార్కెట్‌కు కొన్ని సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయంటున్నారు నిపుణులు. ఎన్ఎస్ఈ ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్లో నిఫ్టీ ఫ్యూచర్స్ 61 పాయింట్ల లాభంతో 23 వేల 769 వద్ద ట్రేడవుతుండటం మార్కెట్ పాజిటివ్‌గా ఓపెన్ అయ్యే అవకాశాలను సూచిస్తోంది. డాలర్‌తో రూపాయి విలువ 96.05 వద్ద ట్రేడవుతోంది. రూపాయి ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. చమరు ధరల పెరుగుదల, విదేశీ ద్రవ్యం అధికం కావడం, పశ్చిమాసియాలో అస్థిరత వంటివి రూపాయి పతనానికి కారణాలుగా ఉన్నాయి.
వాహనదారులపై ఇంధన భారం మరింత పెరిగింది. CNG ధరలను కేంద్రం మరోసారి పెంచింది. కిలోకు రూపాయి చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెండ్రోజుల వ్యవధిలో సీఎన్జీ ధరలు రెండోసారి పెరిగాయి. రెండ్రోజుల క్రితం కిలో గ్యాస్‌పై 2 రూపాయల చొప్పున పెంచారు. దీంతో మూడ్రోజుల వ్యవధిలో CNG వాహనదారులపై 3 రూపాయల అదనపు భారం పడినట్లయింది.
తాజా పెంపుతో హైదరాబాద్‌లో 100 రూపాయలకు చేరింది కిలో CNG ధర. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో 80, నోయిడా-గాజియాబాద్ ప్రాంతంలో రూ.88.70గా ఉండగా..ముంబైలో రూ.84 రూపాయలుగా ఉంది. పశ్చిమాసియా యుద్ధం, హర్మూజ్ జలసంధిలో ఆంక్షల నేపథ్యంలో గ్యాస్, చమురు ట్యాంకర్లు నిలిచిపోయాయి. అంతర్జాతీయంగా ఉత్పత్తి, సరఫరా దెబ్బతినడంతో ఇంధన కొరత ఏర్పడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగాయి. ఫలితంగా దేశీయంగానూ ధరల పెంపు అనివార్యమైంది.
దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పే ఒక అతిపెద్ద సంచలనానికి మోదీ సర్కార్ సిద్ధమవుతోందా? మీ ఇంట్లో.. అల్మారాల్లో.. లాకర్లలో పేరుకుపోతున్న బంగారం, ఇప్పుడు దేశానికి ఆర్థిక ఆయుధంగా మారబోతోందా..? అసలు ఏంటి ఈ గోల్డ్ మానిటైజేషన్ మాస్టర్ ప్లాన్? సామాన్యుడికి దీనివల్ల వచ్చే లాభమేంటి? భారత్ దిగుమతుల భారాన్ని తగ్గించే ఆ 2,000 టన్నుల మ్యాజిక్ ఏంటి..?
భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం కాదు, అది ఒక సెంటిమెంట్.. ఒక భరోసా. కానీ, ఆర్థిక భాషలో చెప్పాలంటే ఇది ఒక డెడ్ అసెట్. అంటే, అది ప్రజల దగ్గర బంగారం ఉన్నంత కాలం దాని విలువ పెరగొచ్చు కానీ, వినియోగదారులకు నెలనెలా ఎలాంటి ఆదాయాన్ని ఇవ్వదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా త్వరలో కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీని అందుబాటులోకి తేనుంది. తద్వారా ప్రజల దగ్గర ఉన్న బంగారంతో వడ్డీ వచ్చేలా ప్రతిపాదించనుంది. వినియోగదారులు వారి వద్ద ఉన్న కనీసం 10 గ్రాముల బంగారం ఉంటే బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చు. గతంలో పెద్ద మొత్తంలో ఉన్నవారికే ఈ అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కేవలం 10 గ్రాముల బంగారం ఉన్నా ఈ స్కీమ్‌లో చేరే అవకాశం కేంద్రం కల్పించింది. డిపాజిట్ చేసిన బంగారంపై వార్షిక వడ్డీ రేటు సుమారు 2శాతం నుంచి 2.5శాతం వరకు పొందవచ్చు.
వాస్తవానికి గోల్డ్ మానిటైజేషన్ స్కీంను 2015లో ప్రారంభించింది మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు బంగారం దిగుమతిని అడ్డుకోవడం, భారతీయుల దగ్గర నిరుపయోగంగా ఉన్న నిల్వ ఉన్న బంగారాన్ని వెలికి తీయడం వంటి రెండు అంశాలను దృష్టి పెట్టుకొని ఓ ప్రత్యామ్నాయ మార్గంగా భావిస్తున్నారు. ఈ స్కీంలో భాగంగా ప్రజలు, సంస్థల దగ్గర నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని సేకరించి ఉత్పాదక ప్రయోజకోసం ఉపయోగించేలా చేయడం, బంగారం దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రెండు రకాల స్కీంలు ఉన్నాయి. ఒకటి బంగారం డిపాజిట్ పథకం, రెండోది బంగారు లోహ రుణం. అప్పట్లో బంగారం సేకరించేందుకు ఇది ఒక గొప్ప ప్రయత్నంగా భావించబడినప్పటికీ, వినియోగదారులను ఆకర్షించడంలో విఫలమైంది. దేశ ప్రజలనుంచి 34వేల టన్నుల బంగారం సేకరించాలని టార్గెట్ పెట్టుకోగా కేవలం 39 టన్నుల బంగారం మాత్రమే సమీకరించగలిగింది.
భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గోల్డ్ ఇంపోర్టర్. ప్రతి సంవత్సరం సుమారు 700 నుంచి 800 టన్నుల బంగారం దిగుమతి అవుతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో అయితే మన బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. అయిదు నెలల కాలంలో 24 శాతం పెరిగాయి. దీంతో దేశానికి సుమారు 72 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో విదేశీ మారకం నిల్వ తగ్గుదలను అడ్డుకునే యోచనలో భాగంగా గోల్డ్ మానిటైజేషన్ స్కీం మళ్లీ తెరపైకి వచ్చింది. పదేళ్లపాటు అమలులో ఉన్న ఈ స్కీంలో కొంత భాగం నిలిపివేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డ్ మానిటైజేషన్ స్కీంను పునరుద్దరించి బలోపేతం చేయాలని కేంద్రం భావిస్తోంది. అందుకే గతంలో ఉన్న ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌కు భారీ మార్పులు తీసుకురావాలని యోచిస్తోంది.
ప్రస్తుతం దేశంలో ప్రజల వద్ద ఉన్న బంగారం సుమారు 30వేల టన్నులు ఉంటుందని ఓ అంచనా. దీన్ని వెలికితీసేందుకు ప్రధాని మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసింది. రూపాయి విలువను బలోపేతం చేయడానికి బంగారం దిగుమతులను తగ్గించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కనీసం 2,000 టన్నుల బంగారాన్ని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ 2,000 టన్నులు గనుక డిపాజిట్ అయితే, రాబోయే 3 ఏళ్ల పాటు భారత్‌కు బంగారం దిగుమతి చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. అయితే ఈ కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో స్పష్టత ఇవ్వనుంది.
ప్రజలు డిపాజిట్ చేసిన బంగారాన్ని బ్యాంకులు జువెలరీ తయారీ సంస్థలకు లేదా ఎగుమతి యూనిట్లకు లీజుకు ఇస్తాయి. దీనివల్ల మార్కెట్లో కొత్త బంగారం లభ్యత పెరుగుతుంది. డాలర్ వినియోగం తగ్గుతుంది. తద్వారా రూపాయి విలువ స్థిరంగా ఉంటుంది. అంతేకాకుండా కరెంట్ ఖాతా లోటు కూడా భారీగా తగ్గుతుంది. అయితే ఈ స్కీమ్ గతంలోనే అమల్లోకి తెచ్చినా..ఇది ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అందుకు చాలా కారణాలే ఉన్నాయి. వారసత్వంగా వచ్చిన బంగారాన్ని కరిగించడానికి ప్రజలు ఇష్టపడడంలేదు. అప్పట్లో వడ్డీ రేట్లు కూడా ఆకర్షణీయంగా లేవు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ స్కీమ్‌పై ప్రజల్లో అవగాహన లేదు.
అయితే ఈ పథకాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం కేంద్రం ఈ సారి మరింత పకడ్బందీగా ముందుకు వెళ్తోంది. మెరుగైన వడ్డీ రేట్లు, డిజిటల్ ట్రాకింగ్, అధిక భద్రత, సులభతరమైన డిపాజిట్ ప్రక్రియ ద్వారా మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తోంది. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించాలని భావిస్తోంది. మొత్తానికి ప్రజల లాకర్లలో పేరుకుపోతున్న బంగారం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారే అవకాశం కనిపిస్తోంది. అయితే, భారతీయులు తమ సెంటిమెంట్‌ను పక్కన పెట్టి బంగారాన్ని బ్యాంకులకు ఇస్తారా? మోదీ సర్కార్ తెస్తున్న ఈ కొత్త నిబంధనలు ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తాయా? అనేది వేచి చూడాలి.

ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని, అవకాశం ఉంటే మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉబెర్ సంస్థకు సూచించారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉబెర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దారా ఖోస్రోషాహి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా తెలంగాణలో ఉబెర్ సంస్థ వ్యాపార కార్యకలాపాలను దారా ఖోస్రోషాహి ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి వివరించారు. హైదరాబాద్‌లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను విస్తరిస్తున్నట్లు ఆయన తెలిపారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన తొలి సెంటర్ ఇదేనని, ఇక్కడ 600 మంది ఇంజినీర్లు పనిచేస్తున్నట్లు ఉబెర్ సీఈవో వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఉబెర్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి ఆయన ముందుకు వచ్చారు. భవిష్యత్తులో మరింత విస్తరణకు ఆసక్తి చూపుతున్నట్లు దారా ఖోస్రోషాహి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సహకారం అందించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.
మెట్రో స్టేషన్ల దగ్గర తగిన పార్కింగ్ సౌకర్యం లేదన్న ఆయన… దీని వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఈవీ ఛార్జింగ్ సెంటర్లతో పాటు పార్కింగ్ సెంటర్ల ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి సూచనపై తప్పకుండా అధ్యయనం చేస్తామని ఉబెర్ ప్రతినిధి బృందం తెలిపింది. హైదరాబాద్‌కు సమీపంలో శంషాబాద్ విమానాశ్రయానికి 25 కిలోమీటర్ల దూరంలోనే భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉబెర్ ప్రతినిధులకు వివరించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 500 కంపెనీలను ఫ్యూచర్ సిటీకి ఆహ్వానిస్తున్నామని, ఇప్పటికే పలు సంస్థలు తమ కార్యకలాపాల కోసం ముందుకు వచ్చాయని సీఎం తెలిపారు. గత డిసెంబర్లో ఇక్కడ నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో 100కు పైగా కంపెనీలు పాల్గొని పెట్టుబడులకు ముందుకు వచ్చాయని వివరించారు.