Monday, August 10, 2026
News Navigation
Monday, August 10, 2026
News Navigation

Breaking

Monday, August 10, 2026
Home Andhra Pradesh కడప లో రామ్ చరణ్ మాస్ ఎంట్రీ

కడప లో రామ్ చరణ్ మాస్ ఎంట్రీ

by Rama
కడప లో రామ్ చరణ్ మాస్ ఎంట్రీ

ప్రముఖ సినీ నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కడపలో సందడి చేశారు. కడప నగరంలోని ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్ద దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన 80 వ ముషాయిర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు దర్గా పీఠాధిపతి ఆరీపుల్లా హుస్సేని ఆశీర్వాదం తీసుకొని దర్గాలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రామ్ చరణ్ తో పాటు దర్శకుడు బుచ్చిబాబు ప్రార్థనలు నిర్వహించి త్వరలో రాంచరణ్ తో తీయబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను మజార్ వద్ద ఉంచి ప్రార్థనలు నిర్వహించారు. దర్గాను దర్శించడం, ఉరుసు ఉత్సవాలలో పాల్గొనడం సంతోషంగా ఉందని తన స్నేహితుడు బుచ్చిబాబుతో కలిసి దర్గాకు వచ్చినట్లు రామ్ చరణ్ తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • టీడీపీ యూనిట్ ఇంఛార్జ్‌ల కోసం శిక్షణా తరగతులు.
    ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, అదే సమయంలో గొడ్డలి పార్టీ చేస్తున్న కుట్రలు, దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు సమర్థంగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇంఛార్జ్‌ల కోసం…
  • ఇరాన్, రష్యాపై ఆంక్షల బిల్లుకు US సెనెట్ గ్రీన్ సిగ్నల్.
    అమెరికా ఎగువ సభ అయిన యుఎస్ సెనెట్ 2026 ఆగస్టు 7న అత్యంత కీలకమైన “లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026” బిల్లును భారీ మెజారిటీతో ఆమోదించింది. అమెరికా రాజకీయాల్లో తీవ్ర విభేదాలున్నప్పటికీ, ఈ…
  • తిరుపతిలో మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం.
    తిరుపతి జిల్లాలో అర్ధరాత్రి వేళ ఓ లారీ డ్రైవర్ మద్యం మత్తులో సృష్టించిన బీభత్సం కలకలం రేపింది. చంద్రగిరి మండలం కొంగరివారిపల్లె సమీపంలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో కలకలం సృష్టించాడు. చిత్తూరు వైపు నుంచి కట్టెల లోడ్‌తో అతివేగంగా తిరుపతి…
  • తెలంగాణలో మద్యం ధరల పెంచే యోచనలో ప్రభుత్వం.
    మద్యం ధరలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. బడ్జెట్, మిడ్-రేంజ్, ప్రీమియం సహా అన్ని రకాల బ్రాండ్ల ధరలను పెంచేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై ఏర్పాటు చేసిన సబ్-కమిటీ, సవరించిన ఎంఆర్‌పీ ధరలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికను…
  • మూసీ సుందరీకరణకు తొలి అడుగు.
    తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవనం, సుందరీకరణ ప్రాజెక్టు పనుల్లో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న మొదటి దశ పనులకు రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ ఆగస్టు 5న ముందస్తు పర్యావరణ…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: