Sunday, July 26, 2026
News Navigation
Sunday, July 26, 2026
News Navigation

Breaking

Sunday, July 26, 2026
Home Andhra Pradesh యారాడ సముద్ర తీరంలో జెట్టి నిర్మిస్తే భూగర్భజలాలు కలుషితం..

యారాడ సముద్ర తీరంలో జెట్టి నిర్మిస్తే భూగర్భజలాలు కలుషితం..

by CVR NEWS

విశాఖ …యారాడ సముద్ర తీరంలో జెట్టి నిర్మిస్తే భూగర్భజలాలు కలుషితమవుతాయని….యారాడ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.సముద్రం పక్కనే వున్న ఇప్పటివరకు మంచినీరు వస్తోంది. జెట్టి నిర్మిస్తే పూర్తిగా సముద్ర తీరం కోతకు గురౌతుందని తద్వారా మంచినీరు కాస్తా ఉప్పునీరుగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.వందల ఏళ్ళు గా నివాసముంటున్న గ్రామస్తులు తమ ఉనికిని కోల్పోతారని పేర్కొన్నారు..మత్సకారులు లేని యారాడ గ్రామానికి జెట్టి ఎందుకు నిర్మించాలనుకుంటున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.మత్స్య కారులకు జెట్టి నిర్మించాలంటే వేరే ప్రాంతాన్ని చూసుకువాలని గ్రామస్తులు సూచించారు..మత్స్య కార గ్రామాలైన ముత్యాలమ్మపాలెం, అప్పుకొండ జెట్టిని గ్రామస్తులు నిరాకరించారు. మత్స్య కారులే లేని యారాడలో ప్రభుత్వం జెట్టిని ఎందుకు నిర్మించాలనుకుంటుందని వారు ప్రశ్నిస్తున్నారు.
యారాడలో జెట్టి నిర్మిస్తే నష్టపోయేది యారాడ మాత్రమే కాదు, గాజువాక పరిసర ప్రాంతాలు పూర్తిగా ఉప్పునీరుగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు..వాస్తవానికి యారాడ సముద్రతీరం కోతకు గురౌతుందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఓసెనోగ్రఫీ, మరికొన్ని ఏజెన్సీలు నిర్దారించాయి…

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: