Friday, March 13, 2026
News Navigation

Breaking

Friday, March 13, 2026
Home TelanganaRangareddy నేడు రేవంత్, భట్టి గురుకులాల బాట

నేడు రేవంత్, భట్టి గురుకులాల బాట

by Rama
నేడు రేవంత్, భట్టి గురుకులాల బాట

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సంక్షేమ హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు… గురుకుల, రెసిడెన్షియల్ హాస్టళ్లను వ్యక్తిగతంగా సందర్శించి తనిఖీ చేయనున్నారు. హాస్టళ్లలోనే విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారు. హాస్టళ్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు ఆకునూరి మురళి అధ్యక్షతన స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్‌‍ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో మరింత ప్రామాణికమైన ఆహారాన్ని అందించడంతో పాటు మెరుగైన విద్యాబోధన అవకాశాలపై సమీక్షించనున్నారు.సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రాష్ట్రంలోని అన్ని గురుకుల సంక్షేమ హాస్టళ్లలో పర్యటించి పరిస్థితిని స్వయంగా సమీక్షించనుంది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.