Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Latest News సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమణ.

సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమణ.

by CVR NEWS

దేశ విద్యావ్యవస్థలో పారదర్శకత, సమగ్ర సంస్కరణల కోసం గత 26 రోజులుగా లడఖ్ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చల అనంతరం ఆయన తన సుదీర్ఘ దీక్షను విరమించేందుకు అంగీకరించారు. విద్యార్థుల ఆందోళనలు, విద్యావ్యవస్థలో చేపట్టాల్సిన మార్పులు, పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకతపై కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు సోనమ్ వాంగ్‌చుక్‌తో సుదీర్ఘ సంప్రదింపులు జరిపారు. ఈ చర్చల సందర్భంగా పరీక్షల లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వీడియో ప్రకటనతో పాటు, విద్యా వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు తీసుకువస్తామని కేంద్ర మంత్రులు స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ సానుకూల స్పందన, స్పష్టమైన హామీతో సంతృప్తి చెందిన సోనమ్ వాంగ్‌చుక్ పానీయం సేవించి తన 26 రోజుల ఆమరణ నిరాహార దీక్షను అధికారికంగా ముగించారు. దీంతో గత కొన్ని రోజులుగా ఢిల్లీ వేదికగా దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఆందోళనల్లో ఒక కీలకమైన ఉద్రిక్తత సమసిపోయినట్లయింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: