41
తాను క్షుద్ర పూజలు చేశానంటూ తప్పుడు ప్రచారం చేసిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌లపై ఆధారాలతో క్రిమినల్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు విచారణకు స్వీకరించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలిపారు. ఈ విషయంలో సెప్టెంబర్ 30న తన స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు కోర్టు అనుమతించిందని వెల్లడించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు, ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే తమపై ఈ తరహా నీచమైన నిందలు వేస్తున్నారని హరీష్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లైనా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నియామకం చేపట్టకపోవడం దారుణమని అన్నారు. సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను కూడా స్పీకర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.