హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజేంద్రనగర్ ఎస్వోటీ బృందంతో కలిసి నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తులో ప్రధాన నిందితుడు మహమ్మద్ ఫైజాన్ బక్షి నాగ్‌పూర్ నుంచి గంజాయిని తెప్పించి, సబ్ప్యాడలర్ సయ్యద్ సాదిక్ ద్వారా చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి నగరంలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 8.410 కిలోల ఎండు గంజాయి, మోటార్‌సైకిల్, డిజిటల్ తూకం మిషన్లు, సీలింగ్ మిషన్, ప్యాకింగ్ మెటీరియల్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అంతర్రాష్ట్ర గంజాయి సరఫరా నెట్‌వర్క్‌పై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
Technology
హైదరాబాద్‌లో అక్రమంగా విక్రయిస్తున్న నిద్రమాత్రలు, దగ్గు సిరప్‌ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. హబీబ్‌నగర్‌లో హైదరాబాద్ సీసీఎస్ స్పెషల్ క్రైమ్ టీమ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో భారీగా మత్తు మందులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు సీపీ క్రైమ్స్ శ్రీనివాస్ తెలిపారు. బీదర్ నుంచి భారీ మొత్తంలో ఈ మందులను హైదరాబాద్‌కు తరలించి, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు.ఈ కేసులో మొహమ్మద్ సర్వార్ అలియాస్ రహీమ్, మొహమ్మద్ రబ్బానీ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ మందులను ఎంతమందికి విక్రయించారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని, బీదర్‌లో కూడా నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.
హైదరాబాద్ లోని సైదాబాద్‌లో సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండో తరగతి చదువుతున్న ఒక హిందూ విద్యార్థికి కల్మా, సూరా అల్ ఫాతిహా చదవాలని, రాయాలని స్కూల్ డైరీలో సూచించడంపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యా సంస్థలు విద్యార్థులకు కేవలం విద్యను మాత్రమే బోధించాలని, ఏ విద్యార్థిపైనా బలవంతంగా మతపరమైన అంశాలను రుద్దే హక్కు పాఠశాలలకు లేదని స్పష్టం చేశారు. అమాయక పసిపిల్లల మనసుల్లో చిన్న వయసులోనే మతపరమైన ఆలోచనలను జొప్పించేందుకు జరుగుతున్న బహిరంగ ప్రయత్నమిది అని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ ముస్లిం సంతుష్టీకరణ, ఓటు బ్యాంకు నీచ రాజకీయాల వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. సదరు పాఠశాల యాజమాన్యంపై ప్రభుత్వం, విద్యాశాఖ తక్షణమే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే మిగతా స్కూళ్లపైనా నిఘా పెంచాలని డిమాండ్ చేశారు
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ కు కేంద్ర ప్రభుత్వం మరోసారి గట్టి షాక్ ఇవ్వనుంది. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వేదికగా యూజర్ల భద్రతపై అసంతృప్తిగా ఉన్న కేంద్ర ఐటీ శాఖ.. మెటాకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా ఉన్న కంటెంట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ రూపంలో ప్రమోట్ చేయడంపై కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి అభ్యంతరకరమైన ప్రకటనలను ఎలా అనుమతిస్తున్నారో వెంటనే వివరణ ఇవ్వాలని కోరుతూ మెటాకు నోటీసులు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి నుండి సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, వాట్సాప్ కొత్తగా తీసుకురానున్న యూజర్‌నేమ్ ఫీచర్‌పై కూడా కేంద్రం ఇప్పటికే నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మొబైల్ నంబర్ లేకుండా కేవలం యూజర్ నేమ్ ద్వారా చాట్ చేసుకునే ఈ ఫీచర్ వల్ల ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఫీచర్ వల్ల యూజర్ల భద్రతకు ముప్పు లేదని సరైన వివరణ ఇచ్చేంతవరకు.. దీన్ని దేశంలో లాంచ్ చేయవద్దని మెటాను ఆదేశించింది. దేశంలో డిజిటల్ భద్రత, ముఖ్యంగా చిన్నారుల రక్షణ, యూజర్ల డేటా ప్రైవసీ విషయంలో ఏమాత్రం రాజీపడేది లేదని తాజా పరిణామాలతో కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. చట్ట వ్యతిరేక కంటెంట్ విషయంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
పర్యావరణ హితమైన, సుస్థిర రవాణా దిశగా భారత రైల్వే ఒక చరిత్రాత్మక ముందడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడిచే రైలును ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. ఉత్తర రైల్వే పరిధిలోని జింద్-సోనిపట్ మార్గంలో 10 బోగీలతో కూడిన ఈ హైడ్రోజన్ రైలును నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ రైలు గంటకు 75 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుంది. దీనికోసం 1,200 కిలోవాట్ల సామర్థ్యం గల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఈ టెక్నాలజీలో హైడ్రోజన్‌ను ఉపయోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియలో కేవలం నీటి ఆవిరి మాత్రమే వెలువడుతుంది. దీంతో సంప్రదాయ ఇంధనాలతో పోలిస్తే కాలుష్యం పూర్తిగా ఉండదు. ఈ చొరవతో హైడ్రోజన్ టెక్నాలజీని రైల్వే రంగంలో పరీక్షిస్తున్న జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది. హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గాన్ని ఈ పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. రైలుకు అవసరమైన హైడ్రోజన్ ఇంధనాన్ని నింపేందుకు జింద్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో రీఫ్యూయలింగ్, నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో కంప్రెస్డ్ హైడ్రోజన్ గ్యాస్ నిల్వ, పంపిణీ కోసం పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నుంచి అవసరమైన లైసెన్సు కూడా లభించింది.
ప్రయాణికుల భద్రతకు రైల్వే అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. జింద్‌లోని రీఫ్యూయలింగ్ కేంద్రంలో హైడ్రోజన్ లీక్ డిటెక్టర్లు, ఫ్లేమ్ డిటెక్టర్లతో సహా పలు భద్రతా సెన్సార్లను ఏర్పాటు చేశారు. రైలు నిర్వహణ కోసం షకుర్బస్తీలో ఏర్పాటు చేయనున్న ఫెసిలిటీలో కూడా కఠినమైన భద్రతా ప్రమాణాలను అమలు చేయనున్నారు. ఆర్డీఎస్వో ఆమోదించిన నిబంధనల ప్రకారం రైలు నిర్వహణ జరుగుతుందని, శిక్షణ పొందిన సిబ్బంది 24 గంటల పర్యవేక్షణలో ఉంటారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రారంభ దశలో రైలుతో పాటు సాంకేతిక సిబ్బంది కూడా ప్రయాణించి, పనితీరును పర్యవేక్షిస్తారు. ఆవిష్కరణలు, ఇంధన సామర్థ్యం, పర్యావరణ హిత రవాణా పట్ల తమ నిబద్ధతను చాటుకుంటున్నామని భారత రైల్వే తెలిపింది. దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించి, నెట్-జీరో లక్ష్యాలను చేరుకునేందుకు ఈ హైడ్రోజన్ రైలు ఎంతగానో దోహదపడుతుందని రైల్వేశాఖ తెలిపింది.
గూగుల్ తన ప్లేస్టోర్ భద్రతను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా 80 వేల డెవలపర్ అకౌంట్లను శాశ్వతంగా తొలగించింది. కేవలం అకౌంట్లే కాకుండా, నిబంధనలను ఉల్లంఘించిన సుమారు 17.5 లక్షల యాప్‌లను కూడా ప్లేస్టోర్ నుంచి తొలగించినట్లు గూగుల్ ప్రకటించింది. వినియోగదారుల వ్యక్తిగత డేటాను దొంగిలించడం, స్కామ్‌లకు పాల్పడటం మరియు మాల్వేర్ వ్యాప్తి చేసే హానికరమైన యాప్‌లను అరికట్టడానికి గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రకటనల మోసాలు, తప్పుడు సబ్స్క్రిప్షన్లు మరియు డివైజ్ స్క్రీన్ ఆఫ్ అయినప్పుడు కూడా యాడ్స్ లోడ్ అయ్యేలా చేసే యాప్‌లపై గూగుల్ కొరడా ఝులిపించింది. మోసపూరిత యాప్‌లను గుర్తించడానికి గూగుల్ అధునాతన AI సాంకేతికతను మరియు ప్లే ప్రొటెక్ట్ టూల్స్‌ను ఉపయోగించింది. సెప్టెంబర్ 2026 నుంచి అన్‌వెరిఫైడ్ డెవలపర్లు రూపొందించే యాప్‌ల సైడ్‌లోడింగ్‌ను కూడా నిలిపివేయాలని గూగుల్ యోచిస్తోంది. అయితే తాజా చర్య వినియోగదారుల భద్రత కోసం తీసుకున్న అతిపెద్ద నిర్ణయాలలో ఒకటిగా పరిగణించబడుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన యూట్యూబ్ సేవలు కాసేపు నిలిచిపోయాయి. అంతేకాకుండా ట్విట్టర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. యూట్యూబ్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఔటేజ్ అని విశ్లేషకులు చెబుతున్నారు. దీనిపై యూజర్స్ పలు సోషల్ మీడియా వేదికల్లో పోస్టులు పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 4 లక్షలకు పైగా యూజర్లు తమ సమస్యను రిపోర్ట్ చేశారు. ఒక్క అమెరికాలోనే 2.4 నుంచి 3.2 లక్షల వరకు ఫిర్యాదులు వచ్చాయి. యూట్యూబ్ ఓపెన్ అవకుండా సమ్ తింగ్ వెంట్ రాంగ్ అనే ఎర్రర్ మెసేజ్ చూపించిందని తెలిపారు. యాప్, వెబ్సైట్ లోడ్ కాకపోవడం, వీడియోలు ప్లే అవకపోవడం వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. సిస్టమ్ గ్లిచ్ కారణంగానే కాసేపు సేవలు నిలిచిపోయినట్లు యూట్యూబ్ ప్రకటించింది.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో 80కి పైగా దేశాల నేతలు, 500 మందికి పైగా గ్లోబల్ ఏఐ నిపుణులు, సీఈఓలు, పరిశోధకులు పాల్గొన్నారు. సమ్మిళిత వృద్ధి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో కృత్రిమ మేధ పాత్రపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చిస్తున్నారు. ఫిబ్రవరి 20 వరకు ఐదు రోజుల పాటు ఈ సదస్సు కొనసాగుతుంది. ఫిబ్రవరి 19న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం చేస్తారు. సమ్మిళిత, బాధ్యతాయుతమైన ఏఐపై భారత్ విజన్‌ను, ప్రపంచ దేశాల సహకారంపై ఆయన తన ప్రసంగంలో దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సదస్సులో 20 దేశాల అధినేతలు, 60 మంది మంత్రులు, ఉప మంత్రులు పాల్గొంటున్నారు.
ఈ సదస్సులో భాగంగా నిర్వహిస్తున్న ‘ఏఐ ఫర్ ఆల్’, ‘ఏఐ బై హర్’, ‘యువ ఏఐ’ పేర్లతో మూడు గ్లోబల్ ఇంపాక్ట్ ఛాలెంజ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ఛాలెంజ్‌లకు 60 దేశాల నుంచి 4,650కి పైగా అప్లికేషన్లు రావడం, బాధ్యతాయుత ఏఐ ఆవిష్కరణలలో భారత్ గ్లోబల్ హబ్‌గా ఎదుగుతోందనడానికి నిదర్శనంగా నిపుణులు పేర్కొంటున్నారు.
ఐఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ఎన్నిరకాల ఫోన్లు విడుదలైనప్పటికీ ఐఫోన్ కు ఉండే క్రేజ్ అసలు తగ్గలేదు. వినియోగదారుల అవసరాలకు తగినట్టుగానే ఆపిల్ కంపెనీ నుంచి ఫోన్లు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆపిల్ కస్టమర్లకు ఇంకో శుభవార్త. ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ 17 ఎయిర్ ఉత్పత్తి దశకు చేరుకుందని, వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదల అవుతుందని ప్రకటన చేసారు . దీనిలో ఈఎస్ఐఎం టెక్నాలజీ వినియోగించారు. సన్నని డిజైన్, ఒకే కెమెరా, తక్కువ బ్యాటరీ పరిమాణంలో విడుదల కానుంది. కొత్త ఐఫోన్ 17 ఎయిర్ ఫోన్ అత్యాధునిక సాంకేతికత, మంచి డిజైన్ తో వస్తుందని భావిస్తున్నారు. ఆపిల్ కంపెనీకి చెందిన అత్యంత సన్నని ఐఫోన్ ఇదేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’ ఇప్పుడు తెలుగు ZEE5లోనూ అద్భుతమైన రికార్డు సృష్టించింది. కేవలం ఒక్క వారంలోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేయటం విశేషం. ఈ ఘనత సినిమాకు ఓ చారిత్రాత్మక స్ట్రీమింగ్…
- అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.అమరావతి రాజధాని నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణానికి ఎలాంటి కట్టడాలు చేపట్టాలన్నా భూమి అవసరమని తెలిపారు. చంద్రబాబుపై నమ్మకంతోనే రాజధాని రైతులు తమ భూములను భూసమీకరణకు ఇచ్చారని అన్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండానే…
- నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో గత నెల తుర్కియే పర్యటన తర్వాత విమానం మార్చినట్లు వెల్లడించారు. ఎయిర్‌ఫోర్స్ వన్‌కు బదులుగా భద్రతా కారణాలతో రహస్యంగా మరో విమానంలో అమెరికాకు చేరుకున్నట్లు తెలిపారు. ఆ బెదిరింపులకు…
- సీతంపేటలో నూతన సబ్ డిపో ప్రారంభం.పార్వతిపురం మన్యం జిల్లా కురుపాం మండలం సీతంపేట గ్రామ ప్రజలకు ఊరట కలిగింది. ఎన్నో ఏళ్లుగా రేషన్ సరుకుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న గ్రామస్తుల సమస్యకు పరిష్కారం లభించింది. సీతంపేట గ్రామంలో నూతన సబ్ డిపో కేంద్రాన్ని…
- అమరావతిలో స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారంటూ విమర్శఅమరావతి నిర్మాణ పనుల్లో మరో కీలక ముందడుగు పడింది. ఉండవల్లి సమీపంలో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. బ్రిడ్జిల వద్ద ప్రత్యేకంగా నిర్మించిన అమరావతి పైలాన్‌ను కూడా సీఎం ఆవిష్కరించారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
C 59 వాహక నౌక ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. నిన్న మధ్యాహ్నం 2.38నిమిషాల నుంచి కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల 8 నిమిషాలకు మొదటి ప్రయోగ వేదిక నుండి నింగిలోకి పిఎస్ఎల్వి సి- 59 వాహక నౌక దూసుకుపోనుంది. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ – ESA కి చెందిన 550 కిలోల బరువు కలిగిన ప్రోబా-3 అనే ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపుతున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. కక్ష్యలోకి చేరిన అనంతరం ప్రోభా ఉపగ్రహం రెండుగా విడిపోనుంది. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై అధ్యాయనం చేయడమే ఈ ఉపగ్రహాల లక్ష్యమని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’ ఇప్పుడు తెలుగు ZEE5లోనూ అద్భుతమైన రికార్డు సృష్టించింది. కేవలం ఒక్క వారంలోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేయటం విశేషం. ఈ ఘనత సినిమాకు ఓ చారిత్రాత్మక స్ట్రీమింగ్…
- అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.అమరావతి రాజధాని నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణానికి ఎలాంటి కట్టడాలు చేపట్టాలన్నా భూమి అవసరమని తెలిపారు. చంద్రబాబుపై నమ్మకంతోనే రాజధాని రైతులు తమ భూములను భూసమీకరణకు ఇచ్చారని అన్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండానే…
- నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో గత నెల తుర్కియే పర్యటన తర్వాత విమానం మార్చినట్లు వెల్లడించారు. ఎయిర్‌ఫోర్స్ వన్‌కు బదులుగా భద్రతా కారణాలతో రహస్యంగా మరో విమానంలో అమెరికాకు చేరుకున్నట్లు తెలిపారు. ఆ బెదిరింపులకు…
- సీతంపేటలో నూతన సబ్ డిపో ప్రారంభం.పార్వతిపురం మన్యం జిల్లా కురుపాం మండలం సీతంపేట గ్రామ ప్రజలకు ఊరట కలిగింది. ఎన్నో ఏళ్లుగా రేషన్ సరుకుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న గ్రామస్తుల సమస్యకు పరిష్కారం లభించింది. సీతంపేట గ్రామంలో నూతన సబ్ డిపో కేంద్రాన్ని…
- అమరావతిలో స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారంటూ విమర్శఅమరావతి నిర్మాణ పనుల్లో మరో కీలక ముందడుగు పడింది. ఉండవల్లి సమీపంలో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. బ్రిడ్జిల వద్ద ప్రత్యేకంగా నిర్మించిన అమరావతి పైలాన్‌ను కూడా సీఎం ఆవిష్కరించారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి