రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని కొత్వాల్ గూడలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్లను హైడ్రా కూల్చివేసింది. పలు కంపెనీలకు చెందిన ఐదు క్రషర్ మెషీన్లతోపాటు 12 ఆర్ఎంసీ యూనిట్లను తొలగించింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్‌శాఖ ఫిర్యాదుతో హైడ్రా ఈ చర్యలు చేపట్టింది. క్రషర్ మిషన్లను తొలగించేందుకు పీబీసీ, మైనింగ్‌శాఖలు హైడ్రా సాయం కోరాయి. రూ.వందల కోట్లు బకాయిలు చెల్లించకుండా అక్రమంగా నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదు చేశాయి. వీటిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవా క్రషర్స్‌ను కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు రాఘవా క్రషర్ అక్రమాలపై చేసిన ఆరోపణలతో ప్రభుత్వం డైలమాలో పడింది. అయితే మంత్రి పొంగులేటిని ఒప్పించిన ప్రభుత్వం తాజాగా కూల్చివేతలు చేపట్టింది. అయితే ఈ కూల్చివేతలపై పొంగులేటి అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పొంగులేటికి చెందిన కంపెనీ ఆ లిస్ట్‌లో లేదని స్థానిక అధికారులు తెలియజేసినా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో తాజా కూల్చివేతలపై హైడ్రా స్పష్టతనివ్వాల్సి ఉంది.
Hyderabad
ఎండలతో మండిపోతున్న తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. రెండు రాష్ట్రాలలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ద్రోణి అంతరాయం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా మున్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నట్టు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.
దక్షిణ కోస్తాలో మూడురోజులపాటు మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం కూడా ఉందని తెలిపింది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని అంచనా వేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం తెలంగాణలో ద్రోణి అస్థిరత ఇప్పుడు దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా మున్నార్ గల్ఫ్ వరకు విస్తరించి ఉంది. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఇదే స్థాయిలో ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ స్పష్టం చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.
ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యింది? హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రీజన్ ఏంటీ? ఎల్ అండ్ టీ లాంటి పెద్ద సంస్థ ఎందుకు మెట్రో రైల్ ను నడపలేకపోయింది ? ప్రభుత్వ పరం అయిన తర్వాత ఎలా నడవనుంది ? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు అందరి మనస్సులలో మెదులుతుంది .దీనిపై సీవీఆర్ ప్రత్యేక కధనం
ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్ట్‌గా గుర్తింపు పొందిన హైదరాబాద్ మెట్రోపై ఇప్పుడు కీలక పరిణామం చోటుచేసుకుంది. సంవత్సరాల పాటు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో కొనసాగిన ఈ ప్రాజెక్ట్ కొత్త దశలోకి ప్రవేశించింది. నగర ముఖచిత్రాన్ని మార్చిన ఈ మెట్రో సేవలు లక్షలాది మందికి ప్రతి రోజు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అయితే ఆర్థిక ఒత్తిళ్లు, మారుతున్న పరిస్థితులు, ముఖ్యంగా కోవిడ్ ప్రభావం కారణంగా ఈ ప్రాజెక్ట్ నష్టాల బారిన పడిందని ఎల్ అండ్ టీ చెబుతోంది . ఇన్నాళ్లు ప్రైవేట్ సంస్థ నిర్వహించిన ఈ మెట్రోను ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవడం కీలక నిర్ణయంగా మారింది. దీని ప్రభావం భవిష్యత్ నగర రవాణా రంగంపై ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
()
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ ప్రయాణం దాదాపు పదిహేనేళ్ల క్రితం ప్రారంభమైంది. మొదట మేటాస్ కన్సార్షియం ఈ టెండర్‌ను దక్కించుకున్నప్పటికీ సత్యం కుంభకోణం తర్వాత అది రద్దయింది. అనంతరం జరిగిన రెండో టెండర్లలో ఎల్ అండ్ టీ ఈ ప్రాజెక్ట్‌ను స్వాధీనం చేసుకుంది. మొదట అంచనా వేసిన వ్యయం కంటే ఎక్కువ ఖర్చుతో ప్రాజెక్ట్ పూర్తయింది. బ్యాంకుల నుంచి భారీ రుణాలు తీసుకుని నిర్మాణం కొనసాగించాల్సి వచ్చింది. 2017లో ప్రారంభమైన మెట్రో సేవలు ప్రస్తుతం మూడు కారిడార్లలో ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రారంభ అంచనాలకు తగ్గట్టుగా ఆదాయం రాకపోవడంతో సంస్థపై ఆర్థిక భారం పెరిగింది . దింతో ఎల్ అండ్ టీ కి ఈ ప్రాజెక్టు ను నడపలేని పరిస్థితి నెలకొంది .
ప్రాజెక్ట్ ఆర్థిక పరిస్థితులను మరింత క్లిష్టం చేసింది కోవిడ్ మహమ్మారి. ఆరు నెలలపాటు మెట్రో సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో ఆదాయం లేకుండా పోయింది. కానీ అప్పులపై వడ్డీ భారం మాత్రం తప్పలేదు . ఈ పరిస్థితుల్లో ప్రాజెక్ట్ తీవ్ర నష్టాల్లోకి వెళ్లింది. ప్రభుత్వం అప్పట్లో వడ్డీ లేని రుణాన్ని అందించినప్పటికీ పరిస్థితి పూర్తిగా చక్కబడలేదు. ప్రయాణికుల సంఖ్య కూడా ఆశించిన స్థాయిలో పెరగకపోవడం మరో సమస్యగా మారింది. దీంతో ప్రాజెక్ట్ నిర్వహణలో ఉన్న ప్రైవేట్ సంస్థకు ఆర్థిక ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో భవిష్యత్ నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. ఇదే ప్రభుత్వం జోక్యానికి దారితీసింది.
ఇప్పటి వరకు ఎల్ని అండ్ టీ నిర్వహణలో ఉన్న మెట్రో ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియలో సంస్థలోని మొత్తం ఈక్విటీని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అంతేకాకుండా భారీ అప్పులను కూడా తన భుజాలపై వేసుకుంది. రెండు దశలు వేర్వేరు సంస్థల చేతుల్లో ఉంటే నిర్వహణలో సమస్యలు వస్తాయని ప్రభుత్వం భావించింది. అందుకే ఒకే సంస్థ ఆధ్వర్యంలో మొత్తం మెట్రో వ్యవస్థను తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఎల్ అండ్ టీ పూర్తిగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో మెట్రో నిర్వహణలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.
ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో రోజుకు లక్షలాది మంది ప్రయాణిస్తున్నారు. ఇప్పటి వరకు కోట్ల మంది ప్రయాణాలు కొనసాగించారు . నగర రవాణాలో మెట్రో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఛార్జీలు, సేవల సమయం, ఇతర సదుపాయాలపై ప్రభుత్వం ప్రత్యక్ష నియంత్రణ కలిగి ఉంటుంది. భవిష్యత్‌లో కొత్త లైన్ల నిర్మాణం, పాత కారిడార్ల అనుసంధానం వేగవంతం చేయవచ్చు. ఇది నగర అభివృద్ధికి మరింత తోడ్పడే అవకాశం ఉంది.
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ప్రయాణం ఇప్పుడు ఒక కొత్త మలుపు తీసుకుంది. ప్రైవేట్ భాగస్వామ్యం నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనానికి మారడం కీలక పరిణామంగా మారింది. ఇది ఒకవైపు ఆర్థిక సవాళ్లను సూచిస్తే మరోవైపు అవకాశాలను కల్పించనుందని తెలుస్తుంది . సమగ్ర రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఇది ఉపయోగపడవచ్చు. భవిష్యత్ నగర ప్రణాళికల్లో మెట్రో కీలక పాత్ర పోషించనుంది. ఈ మార్పులు ప్రయాణికులకు ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తాయో చూడాల్సి ఉంది. మొత్తంగా ఈ పరిణామం దేశంలోని ఇతర పీపీపీ ప్రాజెక్టులకు కూడా ఒక మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్ర పదో తరగతి ఫలితాల్లో భాష్యం విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. హైదరాబాద్ సంజీవరెడ్డి నగర్‌లోని భాష్యం విద్యాసంస్థల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ సాకేత్ రామ్ విద్యార్థులను అభినందించారు. ఈసారి ఫలితాల్లో పి. శృతి, ఆర్. గుణసాయి, శరణ్ రెడ్డి 600కి గాను 595 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. అలాగే వి.ఎస్.ఎన్. శరఘ్న, కె.ఎల్.డి.వి అనురాధ, కె. హనీషా 594 మార్కులు సాధించి ప్రతిభ చూపారు. మొత్తం 7 మంది విద్యార్థులు 590కి పైగా మార్కులు సాధించగా, 203 మంది విద్యార్థులు 580కి పైగా మార్కులు, 434 మంది విద్యార్థులు 570కి పైగా మార్కులు సాధించడం విశేషంగా నిలిచింది. విద్యార్థుల శ్రమ, ఉపాధ్యాయుల కృషి ఫలితంగానే ఈ గొప్ప విజయాలు సాధ్యమయ్యాయని సాకేత్ రామ్ తెలిపారు. విద్యా విధానంలో సమగ్ర ప్రణాళికతో భాష్యం జైత్రయాత్ర కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు
తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం విభిన్న దృశ్యం కనిపిస్తోంది. ఒకవైపు ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గుతుండగా… మరోవైపు ప్రభుత్వ ఆదాయం మాత్రం గణనీయంగా పెరుగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12.5 లక్షల డాక్యుమెంట్లు మాత్రమే నమోదు అయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 13 లక్షలకుపైగా ఉండగా… ఇప్పుడు దాదాపు 50 వేల మేర తగ్గుదల నమోదైంది.
అయితే ఈ తగ్గుదల ప్రభుత్వ ఆదాయంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేదు. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో వచ్చే ఆదాయం సుమారు రూ.600 కోట్ల మేర పెరిగింది. దీని వెనుక ప్రధాన కారణం ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను పెంచడమే అని తెలుస్తుంది . 2026 ప్రారంభం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త గైడ్‌లైన్స్ కారణంగా ప్రతి లావాదేవీపై వసూలు అయ్యే రుసుములు పెరిగాయి. దీంతో తక్కువ రిజిస్ట్రేషన్లు జరిగినా… ప్రతి డీల్ నుంచి అధిక ఆదాయం రావడం వల్ల ప్రభుత్వ ఖజానా బలపడుతోంది.
మరిఓ వైపు రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరగడానికి కొనుగోలుదారుల ధోరణిలో వచ్చిన మార్పు కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది. గతంలో చాలా మంది ఆస్తుల కొనుగోలు సమయంలో కనీస మార్కెట్ విలువ వద్దే రిజిస్ట్రేషన్లు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బ్యాంకుల నుంచి గృహ రుణాలు పొందాలంటే… ఆస్తి అసలు విలువను చూపాల్సిన అవసరం పెరిగింది. దీంతో చాలా మంది కొనుగోలుదారులు నిజమైన మార్కెట్ ధరలకే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ మార్పు ప్రభుత్వానికి భారీ లాభాన్ని తెచ్చిపెడుతోంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ సమయంలో చూపే విలువ పెరిగిన కొద్దీ స్టాంప్ డ్యూటీ, ఫీజులు కూడా పెరుగుతున్నాయి. ఫలితంగా తక్కువ డాక్యుమెంట్లు నమోదైనా… ప్రతి డాక్యుమెంట్ నుంచి వచ్చే ఆదాయం పెరుగుతోంది. ఇది రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత పెరుగుతున్న సంకేతంగా కూడా భావిస్తున్నారు. దీని వల్ల భవిష్యత్తులో అక్రమ లావాదేవీలు తగ్గే అవకాశముందని నిపుణులు అంటున్నారు.
ప్రధానంగా హైదరాబాద్ నగరం ఈ మార్పుల కేంద్రంగా మారింది. ముఖ్యంగా కోకాపేట్, కొండాపూర్, నానక్‌రామ్‌గూడ వంటి ప్రాంతాల్లో లగ్జరీ ఆస్తుల డిమాండ్ గణనీయంగా పెరిగింది. కోటి రూపాయలకుపైగా విలువైన ఇళ్ల విక్రయాలు పెరగడం వల్ల మొత్తం రిజిస్ట్రేషన్ ఆదాయంలో గణనీయమైన వృద్ధి నమోదవుతోంది. నివేదికల ప్రకారం లావాదేవీల సంఖ్య కొంత తగ్గినా… అధిక విలువ గల ఆస్తుల రిజిస్ట్రేషన్ల వల్ల ఆదాయం సుమారు 11 శాతం పెరిగింది. 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రూ.10,600 కోట్ల ఆదాయం వచ్చినప్పటికీ… 2025-26లో అదే కాలంలో రూ.11,300 కోట్లకు పెరిగింది. 6.6 శాతం వృద్ధిని సాధించింది . ఈ ట్రెండ్ కొనసాగితే ప్రభుత్వం నిర్దేశించుకున్న రూ.19,100 కోట్ల లక్ష్యాన్ని సులభంగా చేరుకునే అవకాశం ఉంది. ‘తెలంగాణ రైజింగ్’ వంటి కార్యక్రమాల ద్వారా పెట్టుబడులు పెరగడం కూడా ఈ వృద్ధికి తోడ్పడుతోంది. మొత్తానికి రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గినా… ఆదాయం పెరగడం తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కొత్త ధోరణిని సూచిస్తోందని చెప్పొచ్చు .
హైదరాబాద్ నగరంలో భారీ బస్సు ప్రమాదం కలకలం రేపింది. మియాపూర్ నుంచి పాలకొల్లుకు వెళ్తున్న ‘శ్రీ దుర్గా మహేశ్వరి ట్రావెల్స్’కు చెందిన ఏసీ స్లీపర్ బస్సు, కెపిహెచ్బి పరిధిలోని పద్మావతి ప్లాజా బస్ స్టాప్ వద్దకు చేరుకోగానే మొదట బస్సు డ్రైవర్ క్యాబిన్ నుండి పొగలు వచ్చాయి. మంటలను గమనించిన డ్రైవర్, క్లీనర్ వెంటనే అప్రమత్తమయ్యి, బస్సును పక్కకు ఆపి, అందులో ఉన్న 18 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించేశారు. ప్రయాణికులు ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత మంటలు వేగంగా విస్తరించి, బస్సును పూర్తిగా మింగేశాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తితో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంతో జెఎన్టియు మెట్రో స్టేషన్ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులను వేరే మార్గాల్లోకి మళ్లించడం ద్వారా పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. బస్సు కాలిపోవడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. ప్రాథమిక విచారణలో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్, ఏసీ యూనిట్లో సాంకేతిక సమస్యల వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ టీమ్స్ బస్సును పరిశీలించాక అసలు కారణం తెలిసే అవకాశం ఉంది.
మేడ్చల్ జిల్లాలో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జీడిమెట్ల పారిశ్రామికవాడ రాంరెడ్డి నగర్లో అక్రమ సాల్వెంట్ డ్రమ్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటల తీవ్రతకు కెమికల్ డ్రమ్స్ రోడ్లపైకి ఎగిరిపడటం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. మరోవైపు బహదూర్ పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో డెకరేషన్ సామాగ్రి గోదాంలో కూడా మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఇంటికి వ్యాపించాయి. ప్లాస్టిక్ సామాగ్రి కారణంగా రెండు ప్రాంతాల్లోనూ దట్టమైన పొగ వ్యాపించి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఘటన స్థలాలకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు పక్కనున్న ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు కొనసాగుతున్నాయి. ఈ వరుస అగ్నిప్రమాదాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
మేడ్చల్ జిల్లాలో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జీడిమెట్ల పారిశ్రామికవాడ రాంరెడ్డి నగర్లో అక్రమ సాల్వెంట్ డ్రమ్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటల తీవ్రతకు కెమికల్ డ్రమ్స్ రోడ్లపైకి ఎగిరిపడటం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. మరోవైపు బహదూర్ పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో డెకరేషన్ సామాగ్రి గోదాంలో కూడా మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఇంటికి వ్యాపించాయి. ప్లాస్టిక్ సామాగ్రి కారణంగా రెండు ప్రాంతాల్లోనూ దట్టమైన పొగ వ్యాపించి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఘటన స్థలాలకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు పక్కనున్న ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు కొనసాగుతున్నాయి. ఈ వరుస అగ్నిప్రమాదాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్ టోలీచౌకీలో ఘోర ప్రమాదం.. భవనంపై నుండి పడి ముగ్గురు కార్మికులు మృతి.
హైదరాబాద్‌లోని టోలిచౌకి ప్రాంతంలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక ఐదు అంతస్తుల భవనంపై పని చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కిందపడి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడటంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. టోలిచౌకి పరిధిలోని ఒక నిర్మాణ సైట్లో కార్మికులు ఐదో అంతస్తుపై సెంట్రింగ్ లేదా ఇతర నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పట్టుతప్పి ఐదో అంతస్తు నుండి కింద పడిపోయారు. ఈ ప్రమాద తీవ్రతకు ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ఇద్దరు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన తోటి కార్మికులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. భవన నిర్మాణ సమయంలో కనీస రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి, ఈ ప్రమాదానికి భవన యజమాని లేదా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రగతి నగర్ లో ఉన్న ఫర్నిచర్ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చెక్క సామగ్రి, సోఫాలు, పడకలు, ఇతర ఫర్నిచర్ వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. 15 నుండి 25 వరకు దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. ఒక్కో దుకాణానికి సుమారు 20 నుండి 25 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని బాధితులు తెలిపారు. మొత్తం మీద కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.బాధిత వ్యాపారులకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
కొత్త పెళ్లికూతురు రష్మిక మందన్న తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో ఏడడుగులు వేసిన రష్మిక, సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ సీఎం కుటుంబ సభ్యులతో ఆమె కాసేపు ఆప్యాయంగా గడిపారు. తమ వివాహ రిసెప్షన్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన అర్ధాంగి గీత, ఆయన కుమార్తె నైమిషలను కలవడం చాలా సంతోషంగా ఉందని రష్మిక పేర్కొన్నారు. వారితో గడిపిన సమయం, జరిపిన సంభాషణలు చాలా మధురంగా సాగాయని తెలిపారు. ఈ కలయికలో సీఎం అర్ధాంగి గీత, రష్మికకు ఒక ప్రత్యేక బహుమతిని అందజేశారు. ఆ గిఫ్ట్ పట్ల మురిసిపోయిన రష్మిక, ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.”గీత గారు ఇచ్చిన బహుమతి చాలా అందంగా ఉంది. దీన్ని నేను కచ్చితంగా ఏదైనా అత్యంత ప్రత్యేకమైన సందర్భంలో ధరిస్తాను” అని రష్మిక పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కుటుంబంతో రష్మిక దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండను పెళ్లాడిన తర్వాత రష్మిక సీఎం కుటుంబాన్ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది




Total views : 70907