Friday, March 13, 2026
News Navigation

Breaking

Friday, March 13, 2026
Home Andhra Pradesh మందు బాబులతో SI చిందులు

మందు బాబులతో SI చిందులు

by Rama
మందు బాబులతో SI చిందులు

గొడవలు జరగకుండా కాపలా కోసం నియమించిన ఓ పోలీసు అధికారి విధినిర్వహణ పక్కన పెట్టి మందు బాబులతో SI చిందులు చిందేశాడు.. గ్రామ శివార్లలో మందుబాబులతో కలిసి సదరు పోలీస్ ఎంజాయ్ చేస్తుండగా గ్రామస్థులు వీడియో తీసి ఉన్నతాధికారులకు పంపించారు. దీంతో వెంటనే స్పందించిన ఎస్పీ.. సదరు ఏఎస్సైని అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే శంకరాపురంలో ఇటీవల వివాదం చెలరేగింది. దీంతో గ్రామస్థులు రెండు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో గ్రామంలో మరోమారు వివాదం చెలరేగకుండా పోలీసులు అక్కడికి ఏఎస్సై వెంకటేశ్వర్లుకు డ్యూటీ వేశారు.

విధినిర్వహణలో భాగంగా గ్రామానికి వచ్చిన వెంకటేశ్వర్లు.. తాను వచ్చిన పని మానేసి గ్రామ శివార్లలో మందుబాబులతో కలిసి మద్యపానం చేస్తు మందుబాబులను ఎంకరేజ్ చేశాడు దీంతో మండ్డిపడ్డా ఉన్నతాధికారులు ఆ ఏఎస్సైని సస్పెండ్ చేశారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండల పరధిలోని శంకరాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది..

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.