Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh విశాఖ జైలును సందర్శించిన హోంమంత్రి అనిత

విశాఖ జైలును సందర్శించిన హోంమంత్రి అనిత

by Rama
విశాఖ జైలును సందర్శించిన హోంమంత్రి అనిత

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖపట్టణంలోని సెంట్రల్ జైలును సందర్శించారు. అనంతరం అధికారులతో చర్చించిన మంత్రి.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 800 మంది ఖైదీల సామర్థ్యం ఉన్న విశాఖ సెంట్రల్ జైల్లో ఏకంగా 2000 మందిని ఉంచారన్నారు. ముఖ్యంగా ఈజీ మనీకి అలవాటుపడి గంజాయి సరఫరా చేస్తూ.. 1200 మంది యువకులు పోలీసులకు పట్టుబడ్డారని.. వారంతా ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్నారని,, వారిలో చాలా మందికి బెయిల్ వచ్చినప్పటికి షూరిటీ లేకపోవడంతో జైల్లోనే మగ్గిపొతున్నట్లు తెలిపారు.

అలాగే ఈ విషయంపై హోం సెక్రటరీ తో మాట్లాడి వారిని విడిపించేందుకు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేస్తామని హోంమంత్రి అని తెలిపారు. విశాఖ జైలును సందర్శించిన హోంమంత్రి అనిత త్వరలోనే జైల్లలో డి-అడిక్షన్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. గంజాయి, డ్రగ్స్ విషయంలో రాజకీయ జోక్యం ఉండదని.. ఎవరైనా రాజకీయ నేతలు పోలీసులపై ఒత్తిడి చేస్తే తన దృష్టికి తీసుకురావాలని హోంమంత్రి అనిత పోలీసులకు సూచించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS

  • ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
    ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
  • హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
    హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
  • జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
    ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
  • అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.
    అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
  • శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019379
Total views : 90608

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.