Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Latest News సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమావేశం.

సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమావేశం.

by CVR NEWS
సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమావేశం

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమావేశం నిర్వహించారు.ఈ నెల 18న సరూర్‌నగర్‌లో జరగనున్న బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.సదస్సుకు పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి ఐదు వేల మంది యువతను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యువతకు పెద్దపీట వేయగా… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.ప్రశ్నించే వారిని జైలుకు పంపించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని సూచించారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్న ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించిన గూడెం మహిపాల్ రెడ్డి… యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు.సరూర్‌నగర్‌లో కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్‌ను గాలికి వదిలేసిందని విమర్శించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040820
Total views : 211855

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: