Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Andhra Pradesh నంద్యాల జిల్లా పచ్చర్ల గ్రామంలో ఎమ్మెల్యే అఖిలప్రియ పర్యటన.

నంద్యాల జిల్లా పచ్చర్ల గ్రామంలో ఎమ్మెల్యే అఖిలప్రియ పర్యటన.

by CVR NEWS
నంద్యాల జిల్లా పచ్చర్ల గ్రామంలో ఎమ్మెల్యే అఖిలప్రియ పర్యటన

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని పచ్చర్ల గ్రామంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విస్తృతంగా పర్యటించారు. శ్రీ సర్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.తర్వాత అధికారులు, గ్రామస్థులతో సమావేశమైన ఆమె… గ్రామ అభివృద్ధి, చెంచు గిరిజనుల సమస్యలు, అటవీ ప్రాంత అభివృద్ధి అంశాలపై సమగ్రంగా చర్చించారు.
అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి నల్లమల జంగిల్ సఫారీ క్యాంప్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.పచ్చర్ల గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భూమిపూజ చేశారు.పచ్చర్ల గ్రామానికి ఎన్నోసార్లు వచ్చినప్పటికీ నల్లమల సఫారీ ద్వారా అడవిని సందర్శించడం మరపురాని అనుభూతిని కలిగించిందని ఎమ్మెల్యే తెలిపారు. ఆళ్లగడ్డ ప్రాంతంలో 60 వేల హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉండటం గర్వకారణమని, నల్లమలను రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.వెదురుపై ఆధారపడిన చెంచుల జీవనాధారానికి ఎలాంటి ఆటంకం కలగకుండా అవసరమైన అనుమతులు తీసుకువస్తామని తెలిపారు.దివంగత నేత శోభా నాగిరెడ్డి పచ్చర్ల ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆమె ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం తన బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: