రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఎసిబి వలకు చిక్కాడు. జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి రూ.8 లక్షల లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ధరణి వెబ్ సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుండి 14 గుంటల భూమిని తొలగించాలని సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డిని బాధితుడు జక్కిడి ముత్యంరెడ్డి అడిగాడు. ఈ పని చేసేందుకు ఎనిమిది లక్షలు రూపాయలు ఇవ్వలని సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి డిమాండ్ చేశాడు.లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడిన కలెక్టర్. బాధితుడు కారులో డబ్బులు తీసుకొని మధుమోహన్ రెడ్డికి ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్లు ఎసిబికి సీనియర్ అసిస్టెంట్ చెప్పాడు. ఎసిబి అధికారుల తమ ముందే జాయింట్ కలెక్టర్ కు మధుమోహన్ రెడ్డి చేత ఫోన్ చేయించారు. పెద్ద అంబర్ పేటలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు డబ్బులు తీసుకురావాలని మధు మోహన్ రెడ్డికి జాయింట్ కలెక్టర్ ఫోన్లో చెప్పారు. పెద్ద అంబర్ పేట వద్ద జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డికి సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ డబ్బులు ఇస్తుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర–2047 థీమ్‌తో రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.సీడ్ యాక్సెస్ రోడ్డు…
- ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ చరిత్రలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ గేయాన్ని పూర్తిస్థాయిలో ఆలపించడం…
- టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే యాడ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ ఛానెళ్లలో ప్రతి గంటకు గరిష్టంగా 12 నిమిషాల వాణిజ్య ప్రకటనల ప్రసారానికే పరిమితం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం విధించిన నిబంధనను తొలగిస్తూ కేంద్ర…
- ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైందని, ఫ్లోరెస్ ప్రాంతంలోని ఎండే నగరానికి 68 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదైందని అంతర్జాతీయ భూభౌతిక కేంద్రాలు…
- నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు చెప్పింది. పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ తదితర యూనిఫాం సర్వీసుల ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్ల పాటు పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి