44
విజయనగరం జిల్లా రాజాంలో పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. చీకటిపేట జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా వెళ్తున్న స్కూటర్‌ను తనిఖీ చేసిన పోలీసులు, స్కూల్ బ్యాగ్‌లో దాచిన 4 కిలోల 41 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి విచారణలో లభించిన సమాచారంతో శ్యాంపురం రోడ్డులోని మామిడి తోటలో గంజాయి సేవిస్తున్న మరో నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 20 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయితో పాటు స్కూటర్, మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు సీజ్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ డి. నవీన్ కుమార్ తెలిపారు. గంజాయి రవాణా, విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.