Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Telangana తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..

by CVR NEWS
తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు

ఎండ‌ల‌తో మండిపోతున్న తెలుగు రాష్ట్రాల‌కు వాతావ‌ర‌ణ‌శాఖ చ‌ల్లని క‌బురు చెప్పింది. రెండు రాష్ట్రాల‌లో మూడు రోజుల పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణ‌లో అక్కడ‌క్కడా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ద్రోణి అంత‌రాయం ద‌క్షిణ అంత‌ర్గత క‌ర్ణాట‌క నుంచి త‌మిళ‌నాడు మీదుగా మున్నార్ గ‌ల్ఫ్ వ‌ర‌కు స‌గ‌టు స‌ముద్రమ‌ట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నట్టు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో తేలిక‌పాటి నుంచి మోస్తరు వ‌ర్షాలు లేదా ఉరుముల‌తో కూడిన జ‌ల్లులు ఒక‌టి రెండు చోట్ల కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. గంట‌కు 50 నుంచి 60 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురు గాలులు వీచ‌డంతో పాటు ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉన్నట్టు పేర్కొంది.
ద‌క్షిణ కోస్తాలో మూడురోజులపాటు మోస్తరు వ‌ర్షాలు, ఉరుముల‌తో కూడిన జ‌ల్లులు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావరణశాఖ స్పష్టం చేసింది. వేడి, తేమ మ‌రియు అసౌక‌ర్యమైన వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు ఉండే అవ‌కాశం కూడా ఉంద‌ని తెలిపింది. రాయ‌ల‌సీమ‌లో తేలిక‌పాటి నుంచి మోస్తరు వ‌ర్షాలు లేదా ఉరుముల‌తో కూడిన జ‌ల్లులు కురుస్తాయ‌ని అంచనా వేసింది. హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం ప్రకారం తెలంగాణ‌లో ద్రోణి అస్థిర‌త ఇప్పుడు ద‌క్షిణ అంత‌ర్గత క‌ర్ణాట‌క నుంచి త‌మిళ‌నాడు మీదుగా మున్నార్ గ‌ల్ఫ్ వ‌ర‌కు విస్తరించి ఉంది. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలిక‌పాటి నుండి మోస్తరు వ‌ర్షాలు అక్కడ‌క్కడా కురిసే అవ‌కాశం ఉంది. మూడు రోజుల‌లో గ‌రిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఇదే స్థాయిలో ఉండే అవ‌కాశం ఉన్నట్టు వాతావ‌ర‌ణ‌శాఖ స్పష్టం చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు,మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే ఛాన్స్ ఉంద‌ని తెలిపింది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

009356
Total views : 61941

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.